NTR30: ఎన్టీఆర్30 నుంచి మరో లీక్.. ఆ ఫైట్ సీన్ మామూలుగా ఉండదట!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాగా ఎన్టీఆర్30 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి చాలా విషయాలు లీక్ అవుతుండగా లీక్ అవుతున్న విషయాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ సినిమాలో తారక్ కుస్తీ యోధుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ మొదట ఈ సినిమాలోని మేజర్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారని బోగట్టా.

కుస్తీ పోటీలకు సంబంధించి ఒక యాక్షన్ సీన్ ఉంటుందని ఆ సీన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఫైట్ సీన్ కోసం ఎక్కువ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ ఫైట్ సీన్ కొత్తగా ఉంటుందని తారక్ ను ఊరమాస్ అవతార్ లో కొరటాల శివ చూపిస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని బోగట్టా. తారక్ ఈ సినిమా కోసం బరువు తగ్గడం గమనార్హం. ఫస్టాఫ్ లోనే ఈ ఫైట్ సీన్ ఉంటుందని సమాచారం.

ఈ సినిమా పాటల విషయంలో కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. అనిరుధ్ ఈ సినిమాతో సక్సెస్ సాధించి తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో చేరతారననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. గత సినిమా విషయంలో జరిగిన తప్పులు ఈ సినిమా విషయంలో రిపీట్ కాకుండా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా కొరటాల శివ, అనిరుధ్, జాన్వీ కపూర్ కెరీర్ ను డిసైడ్ చేయనున్నాయి.

ఎన్టీఆర్30 (NTR30) కచ్చితంగా సక్సెస్ సాధించి అభిమానులను మెప్పించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్30 సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండగా ఈ సినిమా అంచనాలను మించి మెప్పించి మెప్పిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్30 రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus