ఒకప్పుడు సినిమా విజయం థియేటర్స్ లో ఆడినరోజులు, సెంటర్స్ ఆధారంగా నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు సినిమా విజయానికి కొలమానంగా ఫస్ట్ డే ఓపెనింగ్స్, కలెక్షన్స్ ఆధారంగా నిర్ణయిస్తున్నాం. పరిశ్రమలో వచ్చిన కొత్త మార్పులు, సవాళ్ల కారణంగా మూవీ అత్యధిక థియేటర్స్ లో విడుదల చేసి తక్కువ కాలంలో పెట్టుబడి, రాబడి రాబట్టుకోవాలి. దీనితో 100 డేస్ 200 సెంటర్స్ అనే ట్రెండ్ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఐతే చాల కాలం తరువాత సంక్రాంతి చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో 50 రోజుల రన్ సాధించాయి.
ఈ రెండు చిత్రాలు జనవరి 11 మరియు 12 తారీఖులలో విడుదల కాగా తెలుగు రాష్ట్రాలలో 50రోజుల ప్రదర్శించబడ్డాయి. ఐతే గతంలో వలె 100ల సెంటర్స్ లో కాకపోయినా అక్కడక్కగా తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు చిత్రాలు నిరవధికంగా 50 డేస్ రన్ పూర్తిచేసుకున్నాయి. చాల కాలం తరువాత కొన్ని రీజనబుల్ సెంటర్స్ లో ఈ చిత్రాలు అధిక రోజులు ప్రదర్శించడం జరిగింది. మహేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు మరియు బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. విశేష ఆదరణ దక్కించుకున్న ఈ రెండు చిత్రాలు ఏపీ మరియు తెలంగాణాలలో చాల థియేటర్లలో 50రోజులు ఆడటం జరిగింది. ఇది నిజంగా మంచి పరిణామం మరియు ఆ రెండు చిత్రాలు భారీ విజయం అందుకున్నాయి అనడానికి నిదర్శనం.