Tollywood: ఫలితాలు గుర్తు చేసుకుంటే కొత్త సినిమాలు కష్టమే!

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి… సినిమాలు వస్తున్నాయి. అయితే ఎక్కడో చిన్న వెలితి థియేటర్లకు ప్రేక్షకులు అనుకున్నంతగా రావడం లేదని. అయితే ఇది సినిమా పరిశ్రమవైపు నుండి. ప్రేక్షకుల వైపు నుండి కూడా ఓ వెలితి ఉంది. అదే సరైన సినిమా థియేటర్లలోకి రావడం లేదని. ఇటీవల కాలంలో వచ్చి… అలరించిన సినిమా అంటే ‘రాజ రాజ చోర’ అనే చెప్పాలి. అయితే గత వారం వచ్చిన సినిమాలు ఆశించిన మేర ఫలితం ఇవ్వలేకపోయాయనే చెప్పాలి.

గత వారం బాక్సాఫీసు దగ్గర అదృష్టం పరీక్షించుకోవడానికి, ప్రేక్షకులకు వినోదం అందివ్వడానికి మూడు సినిమాలు వచ్చాయి. అందులో రెండు కాస్త పేరున్న హీరోల సినిమాలైతే, ఇంకొకటి పూర్తిగా చిన్న సినిమా. అవే సుధీర్‌బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్‌’, సుశాంత్‌ ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’, ఇది కాకుండా ‘హౌజ్‌ అరెస్ట్‌’ ఒకటి వచ్చింది. అయితే ఈ మూడింటి ఫలితాలు ఆశించిన మేర లేవనే చెబుతున్నారు. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ విషయానికొస్తే బజ్‌ బాగానే ఉంది… విడుదలయ్యాక కూడా మంచి పేరే తెచ్చుకుంది.

కానీ ఆదివారానికి వచ్చేసరికి ఆశించిన మేర వసూళ్లు లేవంటున్నారు. ఇక ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ పరిస్థితి తొలి రోజుల నుండీ బాగోలేదట. ‘హౌజ్‌ అరెస్ట్‌’ గురించి చెప్పేంత పరిస్థితి లేదు. దీంతో ఈ వారాన్ని కూడా తెలుగు సినిమా ఎంత త్వరగా మరచిపోతే అంతమంచిది అంటున్నారు. వచ్చే వారం కోసం వెయిట్‌ చేయడమే.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus