సినిమాలు, క్రీడలు… ఈ రెండూ కవలలు లాంటివి అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఎందుకంటే క్రీడలు, క్రీడాకారుల నేపథ్యంలో సినిమాలు వస్తూనే ఉంటాయి. బాలీవుడ్‌లో ఎక్కువగా, టాలీవుడ్‌లో తక్కువగా వస్తుంటాయి ఈ క్రీడా నేపథ్య చిత్రాలు. అయితే ఇటీవల కాలంలో వీటి జోరు పెరిగిందనే చెప్పొచ్చు. మొన్నీ మధ్య ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ వచ్చిన విషయం మనకు తెలిసింది. హాకీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు కబడ్డీ నేపథ్యంలో సినిమా రాబోతోంది.
మొత్తం కొత్తవాళ్లతో కబడ్డీ నేపథ్యంలో ‘అర్జున్ చక్రవర్తి’ అనే సినిమా తెరకెక్కుతోంది. కొత్త కుర్రాడు వేణు కేసీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ రామరాజు, సిజా రోజ్ ప్రధాన పాత్రధారులు. చరిత్రలో తనకంటూ ఓ పేజీ లేని ప్రముఖ కబడ్డీ క్రీడాకారుడి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందట. ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత హిందీ, మలయాళం, కన్నడలోకి డబ్బింగ్ చేసి పాన్ ఇండియా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
రెండేళ్ల క్రితం ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిచారట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జమ్ము కశ్మీర్ సహా మొత్తంగా దేశంలో 125 ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరిపారట. ఈ సినిమాలో హీరోగా ఏడు రకాల మేకోవర్‌తో కనిపిస్తాడట. అంటే చిన్న పిల్లాడి నుండి మధ్య వయస్కుడి వరకు అన్నీ ఒకడే నటించాడట. ఈ సినిమా కోసం 1960, 80ల నాటి పరిస్థితులు కనిపించేలా సెట్స్ కూడా వేశారట.
Most Recommended Video
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!