బిగ్‌బాస్‌ షాకింగ్‌ నిర్ణయం: వెంటవెంటనే రెండు వైల్డ్‌ కార్డులు!

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ మొదలైనప్పుడు ఎంటర్‌టైన్మెంట్‌ అంటే ఏంటో చూపిస్తాం అని నాగార్జున చెప్పాడు. అయితే వారం అవుతున్నా… ఇంకా జోరు పెరగలేదేంటి అనుకుంటుడగా… వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇప్పించేశాడు. ఆ షాక్‌ నుంచి ఇంకా తేరుకోకముందే ఏకంగా ఇప్పుడు రెండో వైల్డ్‌ కార్డును కూడా దించేశాడు. మమూలుగా అయితే వీకెండ్‌లో తీసుకొచ్చే వైల్డ్‌ కార్డు ఈ సారి వీక్‌ మధ్యలోనే వచ్చేస్తున్నాడు. ఇంతకీ అతనెవరనేగా… ఇప్పటికైతే అతనెవరో బిగ్‌బాస్‌ చెప్పలేదు. జోకర్‌ ఫేస్‌తో ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్‌ చేశాడు.

వైల్డ్‌ కార్డు ఎవరు అనే విషయంలో మనం గతంలో అనుకున్నట్లే జబర్దస్త్‌ అవినాష్‌ రెండో వైల్డ్‌కార్డుగా వస్తున్నాడని తెలుస్తోంది. రేపు వచ్చే కంటెంట్‌ అంటూ బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ ఆఖరులో వేసిన వీడియోలో కాస్త ముఖం కనిపిస్తోంది. దానిని నిశితంగా పరిశీలిస్తే ఎవరైనా చెప్పేస్తారు. ఇంట్లో వాళ్లంరూ అంత ఎగ్జైట్‌ అయ్యారు అంటే… అవినాష్‌ జోకర్‌ ఫేస్‌తో రావడం. కన్ఫెషన్‌ రూమ్‌ నుంచి అవినాష్‌ వచ్చే ముందు ఇంట్లో వాళ్లను తన గొంతుతో కాసేపు హడావుడి పెట్టించాడు. తర్వాత ఏమైందో రేపు ఎపిసోడ్‌లో చూడొచ్చు.

ఇప్పటికిప్పుడు రెండో వైల్డ్‌ కార్డును తీసుకురావడంతో బిగ్‌బాస్‌ ప్లాన్‌ ఇంకొకటి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం రెండు ఎలిమినేషన్లు ఉంటాయని తెలుస్తోంది. ఒకటి శనివారం, ఒకటి ఆదివారం ఉండబోతున్నాయి. అందుకే రెండో వైల్డ్‌ కార్డు వచ్చేశాడు. అందులో ఒకరు గంగవ్వ అనేటాక్‌ కూడా వినిపిస్తోంది. పదో రోజు ఫుటేజ్‌ గంగవ్వ స్క్రీన్‌ స్పేస్‌ చాలా తక్కువ. ఆమె ఇబ్బంది పడుతుండటంతో ఎలిమినేషన్‌ రూపంలో పంపించేస్తారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus