‘ఎస్ఎస్ఎంబి28’ లో తన పాత్ర గురించి రివీల్ చేసేసిన యంగ్ హీరో..!

‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాకుండానే ఫస్ట్ షెడ్యూల్ అవ్వగొట్టేసారు అంటూ ఈ చిత్రం షూటింగ్ గురించి కొన్ని కథనాలు కూడా వింటూనే ఉన్నాం. మరికొంతమంది అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల మహేష్ బాబు తల్లి ఇందిర గారు , తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడంతో మహేష్ మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు.

కాబట్టి షూటింగ్.. కొన్నాళ్లపాటు డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మరోపక్క మిగిలిన నటీనటులతో కీలక సన్నివేశాలను చిత్రీకరించాలి అని టీం ప్లాన్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాలో నటించే నటీనటుల లిస్ట్ లో పూజా హెగ్డే పేరు తప్ప.. ఇంకెవ్వరి పేరు వినిపించలేదు. శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్సైడ్ టాక్ కూడా నిజమే అన్నట్టు తెలుస్తుంది. మరోపక్క త్రివిక్రమ్ సినిమా అంటే కచ్చితంగా సెకండ్ హీరో ఎవరొకరు ఉంటారు.

అల వైకుంఠపురములో మూవీలో సుశాంత్, అజ్ఞాతవాసి లో ఆది పినిశెట్టి, అఆ లో అవసరాల శ్రీనివాస్, అరవింద సమేత లో నవీన్ చంద్ర ఇలా ఎవరొకరు ముఖ్య పాత్రలో కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మహేష్ మూవీ కోసం కూడా త్రివిక్రమ్ ఓ యంగ్ హీరోని తీసుకున్నట్లు వినికిడి. అతనే సాయి రోనాక్. ‘పాఠశాల’ ‘గుప్పెడంత ప్రేమ’ ‘లంక’ ‘ప్రెజర్ కుక్కర్’ ‘అంటే సుందరానికి’ ‘ఓదెల రైల్వే స్టేషన్’ వంటి సినిమాల్లో నటించాడు.

ఇప్పుడు మహేష్ బాబు- త్రివిక్రమ్ మూవీలో కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. రోనాక్ హీరోగా నటిస్తున్న రాజయోగం ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus