సుందర్ కు ఉన్న ఆ సమస్యేంటి.. టీజర్ అదిరింది..!

‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న రోమ్-కామ్ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’.మలయాళం స్టార్ హీరోయిన్ నజ్రియా ఈ చిత్రంలో నానికి జోడీగా నటిస్తుంది. ఈ మూవీతో ఆమె టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. ఇక ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ.. ఫస్ట్ సింగిల్ కూడా హిట్ అవ్వడంతో సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Click Here To Watch NOW

ఈ చిత్రంలో హీరో నాని సుందర్ అనే బ్రాహ్మణుడిగా నటిస్తుండగా, నజ్రియా లీలా థామస్ అనే క్రిస్టియన్ అమ్మాయిగా కనిపించనుంది.వీరి లుక్స్ కు సంబంధించిన పోస్టర్ కూడా ఇటీవల విడుదల చేయగా దానికి మంచి స్పందన లభించింది. ఆ పోస్టర్ లో ఈ చిత్రం టీజర్ ను ఏప్రిల్ 20న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళంతో కలుపుకుని 3 భాషల్లో జూన్ 10న ఈ మూవీ విడుదల కాబోతుంది.ఇదిలా ఉండగా.. కొద్దిసేపటి క్రితం ఈ మూవీ టీజర్ ను విడుదల చేసారు మేకర్స్. అది ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

సుందర్(నాని) అతని కుటుంబానికి ఏకైక వారసుడు. ఈ క్రమంలో ఇతని పై అతని ఫ్యామిలీ చూపించే విపరీతమైన శ్రద్ధ సుందర్‌కు ఇబ్బందులను తెచ్చిపెడుతుంది.ఈ క్రమంలో అతను లీలా థామస్‌(నజ్రియా) ప్రేమలో పడటం.. వారి ప్రేమ, పెళ్ళి విషయాల్లో ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అయ్యాయి అనే అంశంతో పాటు సుందర్(నాని) కి ఇంకేదో సమస్య ఉన్నట్టు చూపించారు. అయితే అది ఏంటి అన్నది రివీల్ చేయకుండా సస్పెన్స్ లో ఉంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.

వివేక్ సాగర్ నేపధ్య సంగీతం,సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి.నాని ట్రేడ్‌మార్క్ డైలాగ్ టైమింగ్ ఆకట్టుకుంటుంది. నజ్రియా లుక్స్ కూడా బాగున్నాయి. నాని- నజ్రియా పెయిర్ కూడా బాగుంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus