వినూత్నమైన కథాంశంతో… ఇప్పటివరకు రాని కాన్పెప్ట్ తో తెరకెక్కిస్తున్న సినిమా అంతా విచిత్రం. నిఖిల్, ఇషిక, నీరజ్, సమ్రీన్, జాహ్నసాయి, కావేరి, లిఖిత్, రేవతి, సాయిప్రనీత్, బిట్టు, నరేష్, సిద్ధు, చరణ్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. జగదాంబ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకటా చారి ఎర్రోజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకుడు. ఈ చిత్రం ప్రారభోత్సవం ఆదివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ముహుర్తపు సన్నివేశానికి రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా, రవీజీ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు రామ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో….
రాజ్ కందుకూరి మాట్లాడుతూ…. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి చిత్రాల్ని ప్రోత్సహిస్తే మరిన్ని మంచి చిత్రాలు రావడానికి అవకాశముంది. 14 నుంచి 16 సంవత్సరాల వయసు మధ్య పిల్లలను తీసుకుని సినిమా హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ ను వారికి డిజైన్ చేసి తెరకెక్కిస్తున్న. దర్శక నిర్మాతలు చేస్తూన్న వినూత్న ప్రయోగం ఇది. ప్రయోగంతో పాటు కమర్షియల్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.
డైరెక్టర్ రామ్ కుమార్ మాట్లాడుతూ… అందరు చిన్నపిల్లలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నలుగురు హీరోలు, హీరోయిన్స్ పాత్రలను డిజైన్ చేసి ఎంటర్ టైనింగ్ గా చెప్పబోతున్నాం. పవన్ కల్యాణ్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ, రక్షిత, ఇలియానా, భూమిక, సమంత హీరోయిన్స్ క్యారెక్టర్స్ లో చిన్నపిల్లలు నటిస్తున్నారు. ఐదు పాటలుంటాయి. ఇది మాస్ కామెడి ఎంటర్ టైనర్. బాంబే బోలేగారు మంచి పాటలందించారు. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత వెంకటాచారి ఎర్రోజు మాట్లాడుతూ… మా బ్యానర్ లో రూపొందుతోన్న రెండో సినిమా. మంచి చిత్రాలు తీయడమే జగదాంబ ప్రొడక్షన్స్ లక్ష్యం. ఇప్పటి వరకు ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదని అనుకుంటున్నాం. ఈ నెల 13 నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. జూలై మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. పిల్లలకు పేరెంట్స్ కు మా బ్యానర్ తరపున ఇస్తున్న మంచి బహుమతిగా భావిస్తున్నాం. దర్శకుడు రామ్ కుమార్ కథ చెప్పగానే బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ బాంబే బోలే మాట్లాడుతూ… ‘’సినిమాలో 5 సాంగ్స్ ఉంటాయి. ఇందులో ఇంట్రడక్షన్ లో వచ్చే పిల్లల భవిష్యత్ ను తెలియజేసే ఓ సాంగ్ కూడా ఉంటుంది. అద్భుతంగా వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు చాలా థాంక్స్’’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహ్మద్ అస్లాం మాట్లాడుతూ ‘’కొత్త కాన్సెప్ట్. చిన్నపిల్లలతో కొత్త ప్రయత్నం. సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్’’ అన్నారు.