మహిళల అక్రమ రవాణ పై అలుపెరగని పోరాటం చేసిన సునీతా కృష్ణన్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా సునీత కృష్ణన్ మాట్లాడుతూ..ఈ అవార్డ్ నాకు వచ్చింది కాదు..నా పోరాటానికి వచ్చింది అని భావిస్తున్నాను. నాలాగా పోరాటం చేస్తున్న ఎంతో మంది విజయమే ఆ అవార్డ్ అనుకుంటున్నాను. నేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేస్తున్నాను. ఈ పోరాటాన్ని గుర్తించిన ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పను కానీ నాలా పోరాటం చేస్తున్న వారందరికీ ఇది పెద్ద విజయం అనుకుంటాను. సమస్యను ప్రభుత్వం గుర్తించడం పెద్ద విజయం. నా వల్ల పెద్ద మార్పు రాదు. ప్రభుత్వ యంత్రాంగం కూడా కదిలి వస్తే అప్పుడు మార్పు వస్తుంది. ప్రభుత్వం బాధితురాలకు సపోర్ట్ ఇవ్వాలి. నేరస్థులకు వార్నింగ్ ఇవ్వాలి. నేరస్థులు..ఏమైనా చెయ్యచ్చు. ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటున్నారు. మన పోలీసు యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆడదాన్ని అమ్మడం అంటే భరించం అని కఠిన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మేము చేస్తున్న పని ఒంటరిగా చేస్తున్నాం. ఇలాంటి సంఘనలు జరగకుండా ఉండే రోజు వచ్చే వారు ప్రభుత్వం దీనిపై సీరియస్ గా వర్క్ చేయాలి. సమాజంలో మార్పు రావాలంటే ముందు ప్రతి ఒక్కరు మారాలి. మన పిల్లలకి ముఖ్యంగా అబ్బాయిలకు స్త్రీ లను గౌరవించాలి అని చెప్పాలి. అలా చేస్తే ఈ సమాజం సేవ్ వరల్డ్ అవుతుంది. కొన్నిచోట్ల మహిళలు ఆలయాల్లో ప్రవేశించడం కోసం పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటాలకు సెల్యూట్ చేస్తున్నాను. ఎంతో మంది మహిళలు బానిసత్వంలో బతుకుతున్నారు. వాళ్లని రక్షించడమే నాకు ముఖ్యం. మహిళల అక్రమ రవాణను అడ్డుకునేందుకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. అన్నారు.