Anudeep, Venkatesh:‘ప్రిన్స్‌’ తర్వాత అనుదీప్‌ లైనప్‌ ఇదిగో..!

ఓవర్‌ నైట్‌ స్టార్‌ అంటుంటారు మీరు తెలిసే ఉంటుంది. అంటే ఓ సినిమాతో రాత్రికి రాత్రే గొప్ప పేరు తెచ్చుకున్న సినిమా వాళ్లను అలా పిలుస్తుంటారు. అలా తొలి సినిమాతో కాకపోయినా రెండో సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు కె.వి.అనుదీప్‌. ‘జాతిరత్నాలు’ సినిమాతో కొత్త రకం కామెడీ చూపించి వినోదాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాతి సినిమా కోసం చాలా ప్రయత్నాలు చేసినా.. అనూహ్యంగా తమిళంలో సినిమా ఓకే చేసుకొని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఇప్పుడు లైనప్‌ చెప్పి ఇంకా ఆశ్చర్యానికి గురిచేశారు.

‘జాతిరత్నాలు’ సినిమా ప్రచారంలో హీరో నవీన్‌ పొలిశెట్టి కన్నా.. అనుదీప్‌ కొన్నిసార్లు ఎట్రాక్షన్‌ అయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కామెడీ టైమింగ్, యాటిట్యూడ్‌తో తనదైన శైలిలో వావ్‌ అనిపించారు. ఆ సినిమా విజయంతో వరుస అవకాశాలు సంపాదిస్తారేమో అనుకున్నా.. అనుకున్నది అవ్వలేదు. అయితే తమిళ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌తో ‘ప్రిన్స్‌’ అనే సినిమా చేశారు. త్వరలో ఈ సినిమా విడుదలవుతోంది. ఈలోపు ఆయన కథ అందించిన ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ ప్రచారం కోసం తిరుగుతున్నారు.

ఈ క్రమంలో తన ఫ్యూచర్‌ సినిమాల గురించి మాట్లాడారు. ‘ప్రిన్స్‌’ సినిమాను పాండిచ్చేరి నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కిస్తున్నా అని చెప్పారు. ఆ తర్వాత వెంకటేష్‌కి ఓ కథ వినిపించాల్సి ఉంది అని చెప్పారు. దాంతోపాటు ‘జాతిరత్నాలు’ సీక్వెల్‌ విషయంలోనూ ఆలోచనలు ఉన్నాయని చెప్పారు అనుదీప్‌. దీనిపై కొన్ని ఆప్షన్లు అనుకుంటున్నామని, రెండు మూడేళ్ల తర్వాత ఆ సినిమా చేస్తామని అనుదీప్‌ తెలిపారు. ఈసారి గత సినిమాకు మించిన వినోదం ఉంటుందని కూడా తెలిపారు.

మరోవైపు వెంకటేశ్‌ – శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని వార్తలొస్తున్నాయి. అదే సమయంలో అనుదీప్‌ కూడా ఓ కథ చెబుతున్నారని అంటున్నారు. చాలా రోజులుగా వెంకటేశ్‌ సినిమాలేవీ రావడం లేదు. ఈ ఇద్దరిలో ఓ సినిమా ఓకే చేసుకుంటే సరిపోతుంది కదా అభిమానులు ఆశిస్తున్నారు. మరి వెంకీ మామ ఏమంటారో?

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus