శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ . శ్రీభారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఈ శుక్రవారం (ఈ నెల 3న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత మాట్లాడుతూ “కథ అంతా రెడీ చేసుకుని సినిమా తీయడానికి నిర్మాత కోసం వెతుకుతున్న తరుణంలో నేనే ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుందోనని ఆలోచించా. అమ్మానాన్నలకు చెప్పగా వాళ్లు సపోర్ట్ చేసి డబ్బు పెట్టారు. అందువల్లే ఈ సినిమా పూర్తయింది.
అయితే దగ్గరుండి ఈ సినిమా పూర్తి చేయాలంటే నాకో మనిషి కావాలి. నాకు బాగా తెలిసిన నవీనగారి విషయం మొత్తం చెప్పా. ఆయన నాతో ట్రావెల్ చేశారు. ప్రొడక్షన నుంచి క్యాస్టింగ్ వరకూ అన్ని చూసుకున్నారు. అలాగే హరి కూడా ఎంతో సపోర్ట్ చేశారు. అశోక్ అనే వ్యక్తి హీరో శ్రీరామ్ పరిచయం అయ్యారు. అలా నా చుట్టూ ఉన్న సన్నిహితుల వల్లే ఇక్కడి వరకూ రాగలిగాను. నా టీమ్ అంతా ఎంతో సహకరించారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని అన్నారు.
హీరో శ్రీరామ్ మాట్లాడుతూ “ఈ కథ నన్ను ఏంటో ఇన్స్పైర్ చేసింది. హీరో పాత్రకు నన్ను ఎంచుకున్న దర్శకుడికి చాల థాంక్స్” అని అన్నారు. మౌనిక కలపాల మాట్లాడుతూ “ఏ నటికైనా ఓ సినిమా హిట్టై పేరొచ్చాక అవకాశాలు వాటంతట అవే వస్తాయి. కానీ కెరీర్ బిగినింగ్‌లో ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చినవారే గురువులుగా నిలుస్తారు. నా మొదటి దర్శకుడు రామరాజు, ఇప్పుడు సందీప్‌గారు నాకు అలా అవకాశాలిచ్చారు. నా మొదటి సినిమా లాక్‌డౌన్ వల్ల థియేటర్‌లో విడుదల కాలేదు. ఈ సినిమా విడుదల అవుతున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఈ సినిమా ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు.