Anupam Kher, Ravi Teja: రవితేజకు సారీ చెప్పిన స్టార్‌ యాక్టర్‌… 35 ఏళ్ల క్రితం ఏమైందంటే?

  • October 7, 2023 / 11:32 AM IST

అభిమాన నటుడితో ఫొటోలు దిగాలని కోరుకోని ఫ్యాన్స్‌ ఉండరు. ఎన్నో ప్రయత్నాలు చేసినా వీలుకాక నిరాశపడిన వాళ్లూ చాలామందే ఉంటారు. అవకాశం చేతిదాక వచ్చి… ఆఖరి క్షణంలో మిస్‌ అయినవాళ్లు కూడా ఉంటారు. అలా ఓ వ్యక్తి తన అభిమాన నటుడితో ఫొటో కోసం ప్రయత్నం చేసి నిరాశపడ్డాడు. అయితే ఇప్పుడు ఆ కుర్రాడికి ఆ నటుడు సారీ చెప్పారు. సూపర్‌ కదా అనుకుంటున్నారా? ఆ కుర్రాడు ఎవరో చెబితే డబుల్ సూపర్‌ అంటారు. ఆ కుర్రాడు ఇంకెవరో కాదు మాస్‌ మహరాజా రవితేజ.

బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి ఇప్పుడు ఎంతోమందికి బ్యాగ్రౌండ్‌గా నిలిచాడు రవితేజ. వరుస సినిమాలతో టాలీవుడ్‌లో బిజియెస్ట్‌ హీరోగా ఉన్నాడు కూడా. ప్రస్తుతం తన పాన్‌ ఇండియా సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌లో జరుగుతున్న ఓ ఈవెంట్‌కు అనుపమ్‌ ఖేర్‌ వచ్చారు. అక్కడ ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అలా అనుపమ్‌ఖేర్‌ చెప్పిన ఓ సంఘటన రవితేజ ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌ ఇస్తోంది అని చెప్పొచ్చు. మావోడు ఇందుకే గ్రేట్‌ అంటున్నారు.

‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనుపమ్‌ రవితేజకు ఓ విషయంలో క్షమాపణలు చెప్పారు. 1988లో ఓసారి అనుపమ్‌ ఖేర్‌తో ఫొటో దిగడానికి రవితేజ స్టూడియోకు వచ్చాడట. అప్పటికి అనుపమ్‌ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో వీలుకాదు అన్నారట. ఆ రోజు అలా అన్నందుకు ఇప్పుడు సారీ చెబుతున్నాను అంటూ అనుపమ్‌ తన గ్రేట్‌నెస్‌ నిరూపించుకున్నారు. అయితే ఆ సమయంలో పక్కనే ఉన్న రవితేజ ‘సర్‌ ప్లీజ్‌’ అంటూ అనుపమ్‌ను వారించాడు.

‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాలో (Ravi Teja) రవితేజ సరసన నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌, అనుకృతి వ్యాస్‌ నటించారు. ఈ సినిమాను అక్టోబర్‌ 20న విడుదల చేస్తున్నారు. అయితే సైన్‌ లాంగ్వేజ్‌లోనూ సినిమా రిలీజ్‌ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus