Anupama: ఘనంగా అనుపమ 28 వ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • February 19, 2024 / 06:29 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో టాలెంట్ ఉన్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోని ఈ హీరోయిన్ యంగ్, మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. ఆమె మాతృభాష తెలుగు కాదు, మలయాళీ. అయినా తన అందం, ప్రతిభతో తెలుగువారి మనసు దోచుకుంది. హీరోలకి మించిన స్థాయిలో నటనను కనబరుస్తూ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుదనం ఉట్టిపడే సహజ సౌందర్యం అనుపమది.

చీర, చుడిదార్, పూలు, గాజులు ధరించి సంప్రదాయ తెలుగు అమ్మాయిలా మారగలదు. ఎలాంటి వేషధారణలోనైనా ఆమె అద్భుతంగా కనిపిస్తుంది. అఆ’ ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’ ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘రాక్షసుడు’ వంటి హిట్ చిత్రాలతో ఈమె క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. ‘కార్తికేయ 2 ‘ ’18 పేజెస్’ వంటి చిత్రాలతో ఈమె మళ్ళీ ఫాంలోకి వచ్చింది. ప్రస్తుతం ఈమె ‘డీజే టిల్లు’ సీక్వెల్ అయిన ‘టిల్లు స్క్వేర్’ లో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈమె గ్లామర్ షో చేస్తుంది.

ఇప్పటికే ‘టిల్లు స్క్వేర్’ నుండి ట్రైలర్ ను విడుదల చేశారు. ఊహించని విధంగా (Anupama) అనుపమ పరమేశ్వరన్ – సిద్ధు జొన్నలగడ్డ..ల మధ్య ఘాటు లిప్ లాక్ సీన్ ను చూపించి షాక్ ఇచ్చారు. పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేస్తూ ఎక్స్పోజింగ్ కి చాలా దూరంగా ఉండే ఈమె ఇలాంటి బోల్డ్ రోల్లో కనిపించేసరికి అంతా షాక్ అయ్యారు. అంతకు ముందు ‘రౌడీ బాయ్స్’ లో ఆశిష్ తో కూడా ఈమె రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ లో నటించినప్పటికీ.. ‘టిల్లు స్క్వేర్’ లో మాత్రం డోస్ పెంచిందనే చెప్పాలి.తాజాగా ఈ ముద్దుగుమ్మ తాజాగా తన 28వ పుట్టినరోజును చేస్తూ.. కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను మీరు కుడా ఓ లుక్కేయండి :

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus