అనుపమ పరమేశ్వరన్ కు ఇలా అయినా కలిసొచ్చేనా..?

అనుపమ పరమేశ్వరన్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘అ ఆ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత ‘ప్రేమమ్’ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇక ‘శతమానం భవతి’ చిత్రంతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా మారి వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఓ దశలో ఈమెకు వరుస ప్లాప్ లు ఎదురవ్వడంతో ఆఫర్లు రాలేదు.

ఆ టైములో ‘రాట్ససన్’ రీమేక్ ‘రాక్షసుడు’ సినిమా చేసి హిట్ అందుకుంది. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. కన్నడ, తమిళ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి. హనుమాన్ చౌదరి అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడు.

గతంలో ఈయన రవిబాబు దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసాడట. ‘అవును’ సినిమాకి పనిచేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే బయటకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో అయినా అనుపమ మళ్ళీ బిజీ అవుతుందేమో చూడాలి..!

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus