ఓ సినిమా గురించి దర్శకుడు చెప్పిన కొన్ని మాటలు… ఇప్పుడు తూటాలుగా మారి పెద్ద చర్చ జరుగుతోంది. అది రచ్చకు దారి తీసింది కూడా. దీంతో ఏంటిది.. అసలేం జరిగింది అంటూ ఆ హీరో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అయితే.. ఆ హీరో చియాన్ విక్రమ్. ‘కెన్నెడీ’ సినిమా విషయంలోనే ఇదంతా జరుగుతోంది. ఈ సినిమాను కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మొదలైన ఈ పంచాయితీ సోషల్ మీడియా వార్‌గా మారింది. దీంతో ఏమైంది అసలు అనే చర్చ జరుగుతోంది.
‘కెన్నెడీ’ సినిమా గురించి దర్శకుడు అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలపై చియాన్ విక్రమ్ (Vikram) స్పందించాడు. అనురాగ్ తన కోసం కథ రాశారని తెలిసిన వెంటనే ఆయన్ని సంప్రదించానని చెప్పారు. ఏడాది క్రితం తమ మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేస్తూ ఓ ట్వీట్ చేశారు. దీంతో విక్రమ్ స్పందించలేదు అంటూ గతంలో అనురాగ్ చేసిన వ్యాఖ్య అబద్దం అని తేలిపోయింద అంటున్నారు చియాన్ ఫ్యాన్స్. అయితే అనురాగ్ తొలుత పూర్తిగా చెప్పకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని అంటున్నారు అతని ఫ్యాన్స్.
డియర్ అనురాగ్ కశ్యప్.. ఏడాది క్రితం మన మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేయాలనుకుంటున్నాను. ‘కెన్నెడీ’ సినిమా కోసం నన్ను సంప్రదించినప్పటికీ… నా నుండి ఎలాంటి సమాధానం రాలేదని గతంలో మీరు ఒక నటుడితో మీరు అన్నారు. ఆ విషయం నాకు తెలియగానే మీకు ఫోన్ చేశాను. మీరు కాంటాక్ట్ చేసిన మెయిల్ ఐడీ, మొబైల్ నెంబరు ఇప్పుడు నేను వాడటం లేదని చెప్పాను. అందుకే మీకు కాంటాక్ట్ దొరకలేదని చెప్పాను’’ అని విక్రమ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
అనురాగ్ స్పందిస్తూ ‘‘నిజమే మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి.. నా స్క్రిప్ట్ చదవడానికి ఆసక్తి చూపించారు. అప్పటికే మేం షూటింగ్ షెడ్యూల్ సిద్ధం చేసేసుకున్నాం. మా చిత్రానికి ‘కెన్నెడీ’ అనే టైటిల్ పెట్టుకోవడానికి మీరు పూర్తిగా అంగీకారం తెలిపారు’’ అని చెప్పారు. అయితే అనురాగ్ తొలుత మాట్లాడినప్పుడు ఈ విషయాలు చెప్పలేదు. దీంతోనే ఈ చర్చ వచ్చింది. ఇప్పుడు ఇదే పాయింట్‌ను విక్రమ్ అభిమానులు పట్టుకున్నారు. తొలుత మాట్లాడినప్పుడు ఇవన్నీ చెబితే సరిపోయేది కదా అంటున్నారు.
అయితే అనురాగ్ అదే ట్వీట్‌లో ‘‘కెన్నెడీ’ అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని చెప్పాను అంతే. నా వ్యాఖ్యలను అతిగా చూడాల్సిన అవసరం లేదు. విక్రమ్‌తో కలిసి పనిచేయకుండా రిటైర్ కాను’’ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అనురాగ్. మరి ఈ మాటలకు అందరూ శాంతిస్తారో లేదో చూడాలి.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు