Anushka, Prabhas: వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న అనుష్క ప్రభాస్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు ఒకవైపు హీరో హీరోయిన్లుగా కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఎంతోమంది రెస్టారెంట్ బిజినెస్లలోను అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్లలో కొనసాగుతూ ఉన్నారు. త్వరలోనే ఈ వ్యాపార రంగంలోకి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అలాగే హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. వెండితెరపై అనుష్క ప్రభాస్ జోడికి ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి

వీరిద్దరూ కలిసి ఇది వరకు నాలుగు సినిమాలలో నటించారు. ఆన్ స్క్రీన్ పై తమ నటనతో మెప్పించినటువంటి వీరిద్దరు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఒకటైతే బాగుంటుందని చాలామంది భావించారు కానీ వీరిద్దరి మధ్య అలాంటిదేమీ లేదని మంచి స్నేహితులు మాత్రమే అని చెప్పకు వచ్చారు. ఇలా స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ ఎప్పటికీ తమ పేర్లు కలిసే ఉండేలాగా పెద్ద ప్లాన్ చేశారని తెలుస్తోంది

హైదరాబాదులో ఇద్దరు కూడా తమ (Anushka, Prabhas) ఇద్దరి పేర్లు కలిసేలాగా ఒక పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారట విదేశాలలో ఉన్న విధంగానే హైదరాబాద్లో కూడా అలాంటి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలు వీరిద్దరూ ఉన్నారని సమాచారం. మరి ప్రభాస్ అనుష్క బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus