Anushka, Virat: వామ్మో.. అనుష్క శర్మ బాడీగార్డ్ శాలరీ అన్ని రూ.కోట్లా?

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జోడీకి బాలీవుడ్ ప్రేక్షకుల్లో, క్రికెట్ అభిమానుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఈ జోడీకి రోజురోజుకు పాపులారిటీ పెరుగుతోంది. అనుష్క, విరాట్ కోహ్లీ తమ బాడీ గార్డ్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. వీళ్ల బాడీ గార్డ్ పేరు ప్రకాష్ సింగ్ కాగా ఇతనిని ముద్దుగా సోనూ అని పిలుస్తారు. ఇతని వార్షికాదాయం ఏకంగా కోటీ 20 లక్షల రూపాయలు కావడం గమనార్హం.
ఈ వ్యక్తి ఆదాయం గురించి తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.

సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ ను మించి ఈ వ్యక్తి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారని నెటిజన్ల నుంచి అనుష్క శర్మకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా అనుష్క, విరాట్ కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారని ఆ రీజన్ వల్లే వీళ్లు ఎక్కువ మొత్తంలో వేతనాలను చెల్లించడం సాధ్యమవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్ సింగ్ ను అనుష్క శర్మ కుటుంబ సభ్యునిలా చూసుకుంటారని ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రకాష్ సింగ్ ను అనుష్క శర్మ, కోహ్లీ ఫ్యాన్స్ ఎంతగానో అభిమానిస్తారు. వీళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లినా వాళ్ల భద్రతను ప్రకాష్ సింగ్ చూసుకుంటారు. వీళ్లిద్దరికీ ఎలాంటి సమస్యలు రాకుండా ప్రకాష్ సింగ్ చూసుకుంటారు. ప్రకాష్ సింగ్ అనుష్క శర్మకు మొదటి నుంచి బాడీగార్డ్ కాగా పెళ్లి తర్వాత కూడా బాడీ గార్డ్ గా ఉన్నారు. ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం తమ బాడీ గార్డ్ లకు భారీగానే వేతనాలు చెల్లిస్తున్నారు.

సెలబ్రిటీలు తమ సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని బాడీగార్డ్ ల కోసం ఖర్చు చేస్తున్నారు. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వీళ్లిద్దరికీ ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus