తన ప్రేమ వ్యవహారం బయట పెట్టిన అనుష్క..!

తెలుగు, తమిళ భాషల్లో.. అనుష్క ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ‘బాహుబలి’ తో అయితే బాలీవుడ్ లో కూడా పాపులర్ అయ్యిందనుకోండి. 15 ఏళ్ళు పూర్తయినా అనుష్క హవా ఏమాత్రం తగ్గలేదు. కొత్త హీరోయిన్ గురించి గాసిప్స్ వస్తే ఎంత వైరల్ అవుతున్నాయో… ఇప్పటికీ అనుష్క పై వచ్చే వార్తలు అంతే విధంగా వైరల్ అవుతుంటాయి. ఈమెకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. అనుష్క వయసు 40 ఏళ్లకు దగ్గర పడుతున్నా… ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందుకే ఈమె పెళ్లి గురించి తెగ వార్తలు వస్తుంటాయి. మొదట్లో దర్శకుడు క్రిష్ తో ప్రేమలో ఉందని.. ఆ తరువాత ప్రభాస్ ను పెళ్లి చేసుకోబోతుందని.. ఇక ఇటీవల అయితే ఓ క్రికెటర్ ను పెళ్లి చేసుకుంటుందని అలాగే రాఘవేంద్ర రావు కొడుకు డైరెక్టర్ ప్రకాష్ ను పెళ్లి చేసుకుంటుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటి పై తాజాగా అనుష్క స్పందించింది.

ఆమె మాట్లాడుతూ.. ” నాకంటూ సొంత జీవితం ఉంది. అందులోకి కొందరు వేలుపెట్టే ప్రయత్నాలు చేస్తుండడం నచ్చడం లేదు. నా ప్రేమ,పెళ్లి గురించి చాలా గాసిప్స్ ప్రచారం చేసేవారందరికీ చెప్పేదేమిటంటే… నేను ఒక్కప్పుడు ప్రేమలో పడ్డాను. 2008లో ఓ వ్యక్తిని ప్రేమించాను. అది ఎంతో తీయని ప్రేమ. అయితే ఆ ప్రేమ కొనసాగలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోయాము” అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె ప్రేమించిన వ్యక్తి ఎవరనే విషయం మాత్రం అనుష్క బయట పెట్టలేదు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus