కొన్నేళ్ళుగా తక్కువ సినిమాలతోనే కనిపిస్తున్నప్పటికీ అనుష్క క్రేజ్ కానీ ఇమేజ్ కానీ ఎంత మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. అనుష్క గత చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ విడుదలై 2 ఏళ్ళు కావస్తోంది. తర్వాత ఈమె క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటి’ అనే పీరియాడిక్ మూవీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి చాలా కాలం అయ్యింది.కానీ ఇంకా రిలీజ్ కాలేదు. వాస్తవానికి ఫిబ్రవరిలోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఏప్రిల్ కి వాయిదా వేసినట్లు తెలిపారు. అప్పుడు కూడా సినిమా రిలీజ్ కాలేదు. అటు తర్వాత జూలై 11కి వాయిదా వేశామన్నారు. కానీ ఆ టైంకి కూడా సినిమా రాలేదు. సెప్టెంబర్ 5కి వాయిదా అంటున్నారు.
లేటెస్ట్ టాక్ ప్రకారం ‘ఘాటి’ సెప్టెంబర్‌లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.దానికి మళ్ళీ వి.ఎఫ్.ఎక్స్ కారణం అని తెలుస్తుంది. ఇటీవల వి.ఎఫ్.ఎక్స్ కంపెనీలు ఇచ్చిన ఔట్పుట్ తో చిత్ర బృందం సంతృప్తి చెందలేదట. దీంతో చిత్ర వి.ఎఫ్.ఎక్స్ కంపెనీలు మళ్ళీ వర్క్ చేయాల్సి ఉంది. అందువల్ల సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా ‘ఘాటి’ రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. వి.ఎఫ్.ఎక్స్ కంపెనీ వారు నెక్స్ట్ ఇచ్చే ఔట్పుట్ సంతృప్తి కరంగా ఉంటే నవంబర్ లేదా డిసెంబర్ కి ‘ఘాటి’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్పటి వరకు అనుష్క అభిమానులకు వెయిటింగ్ తప్పదు అనే చెప్పాలి.