ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజైందనే సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఊహించని స్థాయిలో పాజిటివ్ టాక్ వస్తోంది. బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఆర్ఆర్ఆర్ కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చాయి. అయితే కొన్నిరోజుల క్రితం వరకు ఏపీలో బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందనే సంగతి తెలిసిందే.
భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో ఏపీలో ఒక్క థియేటర్ లో కూడా బెనిఫిట్ షో ప్రదర్శితం కాలేదు. రాధేశ్యామ్ సినిమా బెనిఫిట్ షోను ప్రదర్శించడంతో అధికారులు ఒక సినిమా థియేటర్ కు తాళం వేసిన విషయం తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ కు మాత్రం ఏపీలో గేట్లు తెరిచేశారని తెలుస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచి ఏపీలో చాలా ప్రాంతాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శన మొదలైంది. ఏపీలో రోజుకు అయిదు ఆటలకే అనుమతులు కాగా కొన్ని ప్రాంతాల్లో ఆరు షోలు కూడా ప్రదర్శితం అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది.
పవన్ సినిమాల విషయంలో ఒకలా ఇతర హీరోల సినిమాల విషయంలో ఒక విధంగా ఏపీ సర్కార్ వ్యవహరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క్పొ సినిమా విషయంలో ఒక్కో విధంగా వ్యవహరించడం ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రజల్లో పలుచన అవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆచార్య, సర్కారు వారి పాట సినిమాల రిలీజ్ సమయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. ఏపీలో బెనిఫిట్ షోల కోసం 500 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు ఒక్కో టికెట్ ను అమ్మారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ కళ్లు చెదిరే రికార్డులను క్రియేట్ చేయడంలో సందేహం అవసరం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆర్ఆర్ఆర్ ఉండటం గమనార్హం.