Devara: ఫ్యాన్స్ హ్యాపీ.. మరి వాళ్ళ సంగతి ఏంటి.. హాట్ టాపిక్ అయిన దేవర్ టికెట్ హైక్స్.!

  • September 24, 2024 / 08:02 PM IST

పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే బాక్సాఫీసుకి, అభిమానులకి పండుగలాగే ఉంటుంది. కానీ సామాన్యులకి మాత్రం భారంగా మారుతుందని చెప్పాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు పెద్ద బడ్జెట్..లతో రూపొందిస్తారు. కాబట్టి వాళ్లు పెట్టిన మొత్తంలో చాలా వరకు వీకెండ్లోనే రికవరీ చేసుకోవాలని ఆశిస్తారు నిర్మాతలు, బయ్యర్లు. అందుకు కంటెంట్ పై కంటే టికెట్ రేట్లు పెంచుకోవడానికి వారు మొగ్గు చూపుతున్నారు అని స్పష్టమవుతోంది. వీటి వల్ల ప్లస్సు ఉంది. మైనస్ కూడా ఉంది.

Devara

ఫ్యాన్స్ అయితే టికెట్ రేట్లను లెక్క చేయరు కాబట్టి పర్వాలేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ ఇబ్బంది పడతారు. సరే ఇక అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) సినిమా వచ్చే వారం అంటే సెప్టెంబర్ 27 న విడుదల కాబోతోంది. కొరటాల శివ (Koratala Siva) దర్శకుడు కావడంతో హైప్ ఉంది. అందుకే మేకర్స్ టికెట్ రేట్ల పెంపు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు పెట్టుకున్నారు.

ఇందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో అప్పర్ క్లాస్ రూ.110, లోయర్ క్లాస్ రూ.60 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇక మల్టీప్లెక్స్..లలో రూ.135 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ లో రూ.250, మల్టీప్లెక్స్ లలో రూ.400 వరకు టికెట్ రేట్లు ఉండొచ్చు.

టాక్స్ లు వంటి వాటితో కలుపుకుని రూ.300, రూ.500 వరకు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. 2 వారాల వరకు ఈ టికెట్ రేట్స్ అమలులో ఉంటాయట. మరోపక్క అర్ధరాత్రి షోలకి కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో దేవర .. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే భారీ కలెక్షన్స్ వస్తాయి. టాక్ తేడా వస్తే.. జనాలు థియేటర్లకి రాకుండా కూడా ఈ టికెట్ రేట్లు చేస్తాయి అనడంలో సందేహం లేదు.

ఆ సీన్‌ చూసినప్పుడల్లా ఏదో ఆందోళన.. బ్లాక్‌బస్టర్‌పై ఆలియా కామెంట్స్‌ వైరల్‌.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus