మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు రీమేక్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు స్ట్రెయిట్ సినిమాలలో కూడా నటిస్తూ సంవత్సరానికి కనీసం రెండు లేదా మూడు సినిమాలు రిలీజయ్యే విధంగా చిరంజీవి కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని స్వాగతిస్తూనే టికెట్ ధరలలో వెసులుబాటు ఉండాలని కోరిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి పునరాలోచించాలని చిరంజీవి సీఎంను కోరారు.
అయితే చిరంజీవి చేసిన ట్వీట్ గురించి ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. చిరంజీవి అభిప్రాయం గురించి సీఎంతో చర్చిస్తామని ప్రజలకు ఇబ్బందులు లేకుండా టికెట్ ధరలు ఉండేలా చూస్తామని పేర్ని నాని తెలిపారు. చిరంజీవితో పాటు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు టికెట్ రేట్లు పెంచాలని కోరారని సీఎం జగన్ ప్రస్తుతం అసెంబ్లీ హడావిడిలో ఉన్నానని పేర్ని నాని అన్నారు. ప్రతి సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకొని వెళతానని తనతో మాట్లాడుతున్న హీరోలు, నిర్మాతలకు చెప్పానని పేర్ని నాని వెల్లడించారు.
సినిమాటోగ్రఫీ యాక్ట్ సీఎం జగన్ దగ్గరే ఉంది కాబట్టి ఆయనే అంతిమ నిర్ణయం తీసుకోవాలని పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి లేదని తీసుకున్న నిర్ణయం వల్ల కూడా నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. అయితే పైరసీ వల్ల కోట్ల రూపాయలు నష్టపోతున్న నిర్మాతలకు ఏపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కోట్ల రూపాయల ఆదాయం తగ్గనుంది. జగన్ బిజీగా ఉండటం వల్లే సినీ ప్రముఖులను కలవలేకపోతున్నారని పేర్ని నాని చెప్పడం గమనార్హం.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?