2021 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ చిత్రం విజయంతో మళ్ళీ టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చాయి అని అంతా సంతోషపడ్డారు. అందుకు తగినట్లే.. ‘ఉప్పెన’ ‘జాతి రత్నాలు’ సినిమాలు మరింత ఊపు నిచ్చాయి. కానీ ఏప్రిల్ నెలలో కరోనా మళ్ళీ రూపం మార్చుకుని దెబ్బ కొట్టింది. మొదటి 3 నెలలు ఏ ఇండస్ట్రీ కోలుకొని విధంగా టాలీవుడ్ కోలుకుంది అని అనుకున్నారు సినీ జనాలు.. కానీ మిగిలిన ఇండస్ట్రీల దిష్టి తగిలినట్లు ఉంది.
ఏప్రిల్ ఎండింగ్లో చాలా వరకు థియేటర్లు మూతపడ్డాయి. దాంతో ఇదే నెలలో విడుదల కావాల్సిన ‘లవ్ స్టోరీ’ ‘టక్ జగదీష్’ సినిమాలు వాయిదా పడ్డాయి. మే నెలలో కూడా పరిస్థితి నార్మల్ స్టేజ్ కి వచ్చేలా కనిపించడం లేదు.. అందుకే ‘ఆచార్య’ ‘నారప్ప’ ‘అఖండ’ వంటి బడా సినిమాలు వాయిదా పడ్డాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఏప్రిల్ నెలలో మొదటగా థియేటర్లలో విడుదలైన చిత్రాలు ‘వైల్డ్ డాగ్’ ‘సుల్తాన్’. ఈ రెండు చిత్రాలకు పాజిటివ్ టాకే వచ్చింది.
కానీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. తరువాతి వారం ‘వకీల్ సాబ్’ విడుదలయ్యింది. సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుని మొదటి వారం మంచి ఓపెనింగ్స్ నే సాధించింది. కానీ తరువాత కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడడంతో ఈ చిత్రం కోలుకోలేకపోయింది. ఫైనల్ గా అబౌవ్ యావరేజ్ ఫలితం తో సరిపెట్టుకుంది ‘వకీల్ సాబ్’ . ఇక అటు తరువాత విడుదలైన ‘శుక్ర’ ‘ఆర్జీవీ దెయ్యం’ ‘టెంప్ట్ రాజా’ ‘కథానిక’ ‘ఒక అమ్మాయి క్రైం స్టోరీ’ వంటి చిత్రాలు జనాలను థియేటర్లకు రప్పించలేకపోయాయి.