రోజురోజుకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్న ఎక్కడ చూసినా కులం మతం పేరిట ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల ఎంతో ద్వేషపూరితంగా ఉంటున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం కుల మతాలకు అతీతంగా వ్యవహరిస్తూ అందరు సమానమే అని చాటి చెబుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఘటన కేరళలో ఒకటి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోని ఏఆర్ రెహమాన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హిందూ సాంప్రదాయ పద్దతిలో మసీద్‌లో జరిగిన ఒక పెళ్లి వీడియోని రెహమాన్ షేర్ చేశాడు. అసలు కథ ఏంటంటే.. కేరళ అలప్పుజలోని చెరువల్లిలోని ఒక మహిళ తనకూతురి వివాహం చేయడానికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను పడుతున్నారు. అయితే తన కుమార్తె పెళ్లి చేయాలి అంటూ ఈమె అక్కడ మసీద్ కమిటీని ఆశ్రయించారు .అయితే తన అభ్యర్థన మేరకు మసీదులో హిందూ సాంప్రదాయాల పద్ధతిలో తన కుమార్తె పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించారు.
ఇలా ముస్లింలు పవిత్రంగా భావించే మసీదులో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేయడమే కాకుండా పెళ్లికూతురుకు కానుకగా 10 సవర్ల బంగారంతో పాటు 20 లక్షల నగదును బహుమానంగా అందజేశారు. అలాగే పెళ్లికి వచ్చినటువంటి అతిథులందరికీ నాన్ వెజ్ అలాగే వెజ్ తయారుచేసి భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. దేశంలో మతాలు పేరుతో జరుగుతున్న హింసని ఆపేలా మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మసీద్ పెద్దలు ఈ పెళ్లిని ఇంత ఘనంగా చేశారని చెప్పుకొచ్చారు.
ఇక ఈ పెళ్లి వీడియోని ప్రముఖ సంగీత దర్శకుడు (AR Rahman) ఏఆర్ రెహమాన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. మీ మానవత్వానికి జోహార్లు..కులమత బేధాలు లేకుండా మీరు చేసిన ఈ పని వ్యవస్థను మార్చేలా ఉంది అంటూ ఈయన ప్రశంసల కురిపిస్తూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.