Ar Rahman: ఆస్కార్ గెలిచిన వేళ… ఆస్కార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రెహమాన్!

చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు గెలుచుకోవాలని ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా భావిస్తారు.ఇలా ఆస్కార్ కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే 95 వ అంతర్జాతీయ ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా మొదటిసారి తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో ఎంతోమంది రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండుసార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తాజాగా ఈ ఆస్కార్ అవార్డు వేడుకలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో ఈయన ఆస్కార్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఆస్కార్ గురించి, ఆస్కార్ కు ఎంపిక చేసిన సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ కొన్నిసార్లు మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్తాయని నేను అనుకుంటాను కానీ ఆ సినిమాలు ఆస్కార్ వరకు వెళ్ళవని ఆయన తెలిపారు.

ఎలాంటి అర్హత లేని సినిమాలను ఆస్కార్ కి పంపిస్తున్నారని కామెంట్స్ చేశారు. ఇలా చేసినప్పటికీ తాను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా అధికారకంగా ఆస్కార్ ఎంట్రీ కోల్పోయింది. అయితే ఈ సినిమా ఎలాగలాగో కష్టపడి ఆస్కార్ నామినేషన్ కి వెళ్లి ఆస్కార్ అవార్డును అందుకుంది. ఈసారి అధికారిక ఎంట్రీగా ‘ఆర్ఆర్ఆర్’ని కాదని గుజరాతీ మూవీ ‘ఛెల్లో షో’ని పంపించారు.

అది కనీసం నామినేషన్స్ వరకు కూడా వెళ్లలేకపోయింది. దీంతో రెహమాన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఈ సినిమాను ఉద్దేశించి చేశారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus