Arjun Kapoor: గొడవకు వెళ్లిన హీరో.. చివరకు!

బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ తన కజిన్ సోనమ్ కపూర్ ను ఏడిపించిన వ్యక్తిని నిందిస్తూ అతడితో గొడవకు దిగాడట. కానీ అతడు బాక్సర్ అనే విషయం తెలియకపోవడంతో చివరకు తనే దెబ్బలు తిని ఇంటికి వెళ్లాల్సి వచ్చిందట. ఈ విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ చెప్పుకొచ్చాడు. చిన్నప్పుడు అర్జున్, అతడి కజిన్ సోనమ్ ఇద్దరూ కలిసి ఆర్య విద్యా మందిర్ స్కూల్ లో చదివేవారు. ఇద్దరికీ బాస్కెట్ బాల్ ఆడడం అంటే ఎంతో ఇష్టం ఉండేది.

ఓసారి సోనమ్ స్కూల్ గ్రౌండ్ లో బాస్కెట్ బాల ఆడుకుంటూ ఉండగా.. సీనియర్లు వచ్చి ఆమె దగ్గరున్న బాల్ ను లాక్కున్నారట. ఆడింది చాలు.. ఇక మేం ఆదుకుంటామని దురుసుగా సమాధానం ఇవ్వడంతో.. వెంటనే సోనమ్ ఏడ్చుకుంటూ వెళ్లి అర్జున్ కు కంప్లైంట్ చేసిందట. తన సోదరిని ఏడిపించారని తెలియగానే అర్జున్ కి కోపం వచ్చిందట. వెంటనే సోనమ్ ని ఏడిపించిన వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇష్టమొచ్చినట్లు తిట్టాడట. కాసేపటివరకు అర్జున్ తిట్లు విన్న అవతలి వ్యక్తి చివరకు అర్జున్ ముఖం మీద గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడట.

దీంతో అతడు కుమిలిపోయిన ముఖంతో ఇంటికి వెళ్లాడట. ఇదంతా తనవల్లే జరిగిందని సోనమ్ క్షమాపణలు చెప్పిన విషయాన్ని అర్జున్ గుర్తుచేసుకున్నాడు. అతడు కొట్టిన పంచ్ కి హాస్పిటల్ కు వెళ్లాల్సి వచ్చిందని.. ఇది కాకుండా గొడవకు తనే కారణమని స్కూల్ లో సస్పెండ్ చేసినట్లు తెలిపాడు. ఇంతటి అవమానం జరగడంతో ఇకపై స్కూల్ లో నీకు సంబంధించి ఏం జరిగినా నువ్వే చూస్కో అంటూ సోనమ్ కి గట్టిగా చెప్పినట్లు వెల్లడించాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus