అషురెడ్డి (Ashu Reddy) అందరికీ సుపరిచితమే కదా. టిక్ టాక్ వాడకం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈమె జూనియర్ సమంతగా వీడియోలు చేసేది. తర్వాత ‘ఛల్ మోహన్ రంగ’ (Chal Mohan Ranga) సినిమా ద్వారా నటిగా మారింది. ఆ తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 3’ లో ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. అయితే అషురెడ్డి కి సర్జరీ జరిగింది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వంటివి వైరల్ అవుతున్నాయి.
అషురెడ్డి తన సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ తో అందరినీ ఆందోళనకు గురి చేసే విధంగానే ఉంది. అందులో ఒక వీడియో ఉంది. ఆమె హాస్పిటల్ బెడ్ పై పడుకోవడం, తలకి బ్యాండేజ్లు వంటివి ఉండటం గమనార్హం. అయితే అది ఇప్పటి వీడియో కాదట. ఒక సంవత్సరం క్రితం వీడియో అని తెలుస్తుంది. 2024 లో అషురెడ్డికి బ్రెయిన్ సర్జరీ జరిగిందట. సర్జరీ టైంలో తీసిన ఫోటోలు..
అలాగే వీడియో బైట్స్ జత చేసి ఈ వీడియో బైట్ చేసినట్టు స్పష్టమవుతుంది. దానికి ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ (Shankar Dada M.B.B.S) సినిమాలోని ‘చైల చైల’ పాటని జత చేసింది. ‘ఇది జీవితం’ అన్నట్టు ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ కష్టకాలంలో ఆమెకు అండగా నిలబడ్డ వారికి కూడా ఈ సందర్భంగా థాంక్స్ అంటూ రాసుకొచ్చింది.దీంతో నెటిజన్లు స్టే స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ పెడుతూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు.