Ashu Reddy: అషూ జెర్నీలో అది చూపించలేదు..! కారణం ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో అషూరెడ్డి జెర్నీ ముగిసింది. అత్యంత నాటకీయంగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో చివరివరకూ అరియనా, ఇంకా అషూ ఇద్దరూ ఉన్నారు. అరియానా ఎప్పటిలాగానే టెన్షన్ పడింది. అందుకే, అఖిల్ తో కాసేపు మాట్లాడింది. లాస్ట్ వీక్ చెప్పిందే నేను ఇప్పుడు నీకు చెప్తున్నా, గేమ్ బాగా ఆడు అంటూ అఖిల్ తో మాట్లాడింది. అలాగే, అషూ కూడా తనే ఎలిమినేట్ అవుతున్నానని ముందుగానే ఊహించింది. అరియానా, అషూ ఇద్దరిలో అషూ ఎలిమినేట్ అనగానే ఎలాంటి ఎమోషన్స్ లేకుండా కూల్ గా స్టేజ్ పైకి వచ్చేసింది అషూ.

అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ నాగార్జునతో స్టేజ్ షేర్ చేసుకుంది. ఇక్కడే అషూ జెర్నీ చూపించాడు నాగార్జున. ఎక్కువగా అల్లరి చేసింది. ఆ తర్వాత నామినేషన్స్ ఇష్యూ, ఆ తర్వాత టాస్క్ లు, ఎమోషన్ ఎప్పటిలాగానే జెర్నీని కట్ చేశారు. దీంతో అషూ కొద్దిగా ఎమోషనల్ అయ్యింది. అయితే, అషూ జెర్నీలో బాత్రూమ్ లో సిగరెట్ తాగిన విషయం, శివతో షర్ట్ గురించి గొడవ పడింది, కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడింది ఇవేమీ చూపించలేదు.

జెర్నీ చూసిన తర్వాత అషూరెడ్డి నాగార్జునతో ఒకటి మిస్ అయ్యిందంటూ నోరు జారి చెప్పింది. దీనికి నాగార్జున యాడ్ చేయమంటావా.. మళ్లీ అంటూ సెటైర్ వేశారు. నువ్వు అలా చెప్తే చేసేస్తారు అంటూ మాట్లాడాడు. దీంతో ఒక్కసారి ఖంగుతిన్నది అషూ. ఇదే తగ్గించుకోవాలంటూ మాట్లాడింది. జెర్నీ అయిపోయిన తర్వాత అషూ హౌస్ మేట్స్ ని పలకరిస్తూ అషూ ఒక్కొక్కరికి ఒక్కో వెజిటిబుల్ , ఇంకా ఫ్రూట్ ఇచ్చింది. దానికి కారణం కూడా చెప్పింది.

నటరాజ్ మాస్టర్ కి కొబ్బరి బోండాం, అరియానాకి మాంగో , అనిల్ కి క్యాబేజీ, శివకి వంకాయ్ ఇలా ఇస్తూ తనదైన స్టైల్లో హౌస్ కి వీడ్కోలు చెప్పింది అషూ. మొత్తానికి సీజన్ 3 కంటే కూడా ఓటీటీలోనే అషూరెడ్డి కి మంచి పేరు వచ్చింది. లాస్ట్ టైమ్ కంటే కూడా బెటర్ గేమ్ ఆడింది. ఇన్ని వారాలు హౌస్ లో ఉండి తను టాప్ 5కి ఆల్ మోస్ట్ చేరువైంది.

గేమ్ లో చేసిన కొన్ని మిస్టేక్స్, హౌస్ మేట్స్ తో వచ్చిన ఇష్యూలో లాజిక్స్ లేకపోవడం అనేది అషూ గేమ్ ని దెబ్బతీశాయనే చెప్పాలి. మొత్తానికి అదీ మేటర్.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus