Allu arjun, Akhil: హీరోల జాతకాలపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పిన జాతకాలు నిజం కావడంతో చాలామంది ఆయన జాతకాలను నమ్ముతారు. చైసామ్ వైవాహిక జీవితం గురించి వేణుస్వామి కొన్నేళ్ల క్రితం చెప్పిన విషయాలు వాళ్లు విడాకులు తీసుకోవడం వల్ల నిజమని ప్రూవ్ అయ్యాయి. చైతన్య సమంత విడిపోతారని చెబితే తనను తిట్టారని కానీ అదే నిజం కావడంతో చాలామంది రియలైజ్ అయ్యారని ఆయన చెప్పుకొచ్చారు.

తాను పబ్లిక్ డొమైన్ లో ఉన్నవాళ్ల గురించి మాట్లాడతానని ఆయన కామెంట్లు చేశారు. టాలీవుడ్ లోని ఇద్దరు హీరోల సినిమాలు ఆగిపోతాయని ఆరోగ్య సమస్యల వల్లే ఇద్దరు హీరోల సినిమాలు ఆగిపోతాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం బాగున్న జాతకం బన్నీ జాతకం అని వేణుస్వామి వెల్లడించారు. రాబోయే ఐదేళ్ల వరకు బన్నీ జాతకంలో పెద్దగా మార్పు లేదని ఆయన చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కే సినిమాలకు 200 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని ఆయన కామెంట్లు చేశారు.

మహేష్, రానా, తారక్ జాతకం బాగుందని వేణుస్వామి పేర్కొన్నారు. ఎవరి ప్రభావం లేకుండా అఖిల్ సినిమాలు చేయాలని వేణుస్వామి తెలిపారు. అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని వేణుస్వామి వెల్లడించారు. హీరోయిన్ సమంత జాతకం బాగుందని వేణుస్వామి వెల్లడించారు. సమంతపై నెగిటివిటీ తగ్గుతుందని వేణుస్వామి కామెంట్లు చేశారు. రష్మిక, పూజా హెగ్డేల జాతకాలు కూడా కొన్నేళ్ల పాటు అద్భుతంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. మరి వేణుస్వామి సెలబ్రిటీలకు సంబంధించి చెప్పిన విషయాలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది.

అయితే హీరో ప్రభాస్ జాతకం మాత్రం బాలేదని వేణుస్వామి కామెంట్లు చేశారు. వేణుస్వామి చేసిన కామెంట్లు ప్రభాస్ అభిమానులను బాధ పెడుతున్నాయి. కొంతమంది ప్రభాస్ అభిమానులు వేణుస్వామిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus