Prabhas, Aswani Dutt: అల్లుడి సినిమాని ఆకాశానికెత్తిన అశ్వనీదత్‌!

ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కలయికలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దీని ‘ప్రాజెక్ట్‌ కె’ అనే వర్కింగ్‌ టైటిల్‌ కూడా పెట్టారు. ఈ సినిమా కథేంటి, ఎలా ఉంటుంది అనే విషయాలు అఫీషియల్‌గా ఎక్కడా ఎప్పకపోయినా, ఇదో టైమ్‌ ట్రావెల్‌ స్టోరీ అని మాత్రం వార్తలొస్తున్నాయి. పక్కా ప్లానింగ్‌తో నాగ్‌ అశ్విన్‌ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దీని కోసం బాలీవుడ్‌ నటులను కూడా తీసుకొస్తున్నారు. అయితే ఈసినిమా గురించి, తర్వాతి పరిస్థితుల గురించి ఆ సినిమా నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రభాస్‌ గురించి ఆయన అన్న మాటలు వైరల్‌గా మారాయి. ప్రభాస్‌ ఇటీవల పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ఇటీవల అంటే ‘బాహుబలి’ తర్వాత అని అనుకోండి. ఆ తర్వాత ‘సాహో’తో వచ్చి మన దగ్గర ఫర్వాలేదనిపించినా బాలీవుడ్‌లో వావ్‌ అనిపించాడు. ఇప్పుడు ‘ప్రాజెక్ట్‌ కె’ తర్వాత ఏకంగా హాలీవుడ్‌ హీరో అయిపోతాడు అని అంటున్నారు అశ్వనీదత్‌. ‘ప్రాజెక్ట్‌ కె’ కథ అలాంటిదని, ఈ సినిమా చేశాక ప్రభాస్‌ కోసం హాలీవుడ్‌ వాళ్లు కూడా వెతుకుతారని చెప్పారట అశ్వనీదత్‌.

ఇప్పటివరకు ఏ ఇండియన్‌ హీరో కోసం అలా హాలీవుడ్‌ వాళ్లు వెతికి ఉండరు, కానీ ప్రభాస్‌ కోసం వెతుకుతారు అని అంటున్నారు అశ్వనీదత్‌. అశ్వనీదత్‌కు నాగ్‌ అశ్విన్‌ అల్లుడవుతాడనే విషయం తెలిసిందే. మరి ఆ అభిమానంతో సినిమా గురించి అలా చెప్పారో, లేక సినిమాలో స్టఫ్‌ అంతుందో కానీ… సినిమా ఇంకా సెట్స్‌ మీద ఉండగానే ఇంతగా హైప్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అశ్వనీదత్‌. అయితే సినిమా మొత్తం భారీ తారాగణంతో నిండిపోయింది.

కథానాయికగా దీపికా పదుకొణె నటిస్తుండగా, కీలక పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్నారు. ఇటీవల సినిమా షూటింగ్‌ మొదలైంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ చిన్నపాటి వీడియోను కూడా చిత్రబృందం విడుదల చేసింది. అందులో రెండు చేతులు మాత్రమే చూపించారు. అవి ప్రభాస్‌, దీపికా పదుకొణె చేతులే. అశ్వనీదత్‌ చెప్పినట్లుగా సినిమాకు అంత పేరొచ్చి, ప్రభాస్‌ హాలీవుడ్‌ రేంజికి వెళ్లిపోతే మంచిదే కదా. ఆల్‌ ది బెస్ట్‌ ‘ప్రాజెక్ట్‌ కె’.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus