టాలీవుడ్ ని ఏలుతున్న వంశాల్లో నందమూరి వంసానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్ ను శాసిస్తున్న వారిలో నందమూరి హీరోల పాత్ర అధికం అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఆ వంశంలో ఎన్టీఆర్ వారసులుగా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బడా హీరోలుగా మారిపోయారు. అందులో ఒకరు నందమూరి బాలకృష్ణ, మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్, అయితే వారి తరువాత ఎన్టీఆర్ వారసత్వాన్ని దశదిశలా వ్యాపింపజేసెందుకు నడుం కట్టిన హీరోల్లో కల్యాణ్ రామ్ ఒకరు. సోలో హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన కల్యాణ్ రామ్ తొలి రోజుల్లో కాస్త ఇబ్బంది పడ్డాడు.
అయితే బాబాయి నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహంతో, ఆయన ఆశీసులతో ప్రముక దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అతనొక్కడే’. ఈ సినిమా 2005లో మే7న విడుదలయ్యి భారీ విజయాన్ని సాధించడమే కాకుండా అటు కల్యాణ్ రామ్ కి తొలి హిట్ గా నిలిచి కల్యాణ్ రామ్ ను హీరోగానే కాకుండా ఈ సినిమాకు నిర్మాతగా సైతం సక్సెస్ ను అందించింది. ఈ సినిమా విడుదలయ్యి దాదాపుగా 10ఏళ్లు అవడంతో అలా..అలా..ఒక్కసారి కల్యాణ్ రామ్ అతనొక్కడే సినిమాను గుర్తు చేసుకుందాం… అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా తరువాత కల్యాణ్ రామ్ వరుస సినిమా చేసినా…ఈ ‘పటాస్’ సినిమా వరకూ ఆయనకు హిట్ దక్కకపోవడం కాస్త ఇబ్బంది పెట్టే అంశమే. ఏది ఏమైనా…గేలుపు ఓటములతో సంభందం లేకుండా కల్యాణ్ రామ్ వరుస సినిమాలతో ఎన్టీఆర్ ఆర్ట్స్ కీర్తిని మునుముందుకు తీసుకెళ్లాలి అని ఆశిద్దాం.