స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో నటించే ఛాన్స్ వస్తే ఏ స్టార్ హీరో అయినా ఎగిరి గంతేస్తారు. రాజమౌళి సినిమాలో నటిస్తే తమ ఫేవరెట్ హీరోలకు సక్సెస్ గ్యారంటీ అని అభిమానులు సైతం నమ్ముతారు. అయితే గత కొన్నేళ్లలో రాజమౌళి మరీ నిదానంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గడిచిన పదేళ్లలో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు కేవలం మూడు మాత్రమే కావడం గమనార్హం. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈగ సినిమా 2012 సంవత్సరం జులై 6వ తేదీన విడుదలైంది.
ఈగ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో బాహుబలి. బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలు మాత్రమే తెరకెక్కాయి. ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రాజమౌళి మహేష్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా త్రివిక్రమ్ సినిమా పూర్తైన తర్వాతే మహేష్ జక్కన్న మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. 2012 సంవత్సరం ఆగష్టు నుంచి 2022 మార్చి వరకు రాజమౌళి కేవలం మూడు సినిమాలను తెరకెక్కించడంపై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.
క్వాలిటీ కోసం ఎక్కువ సమయం సీన్లను చిత్రీకరించడం తప్పు కాదని అయితే రాజమౌళి మరీ ఎక్కువ సమయం తీసుకుంటూ ఉండటంతో తమ ఫేవరెట్ హీరోలు ఎక్కువ సినిమాలలో నటించలేకపోతున్నారని అభిమానులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మహేష్ తో తెరకెక్కించే సినిమా షూటింగ్ ను వేగంగానే పూర్తి చేస్తానని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించారు. అయితే రాజమౌళి ఆ మాటను నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.
రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో కేవలం 12 సినిమాలను మాత్రమే తెరకెక్కించారు. రాబోయే పదేళ్లలో జక్కన్న కనీసం 5 సినిమాలను తెరకెక్కిస్తారేమో చూడాలి. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా రాజమౌళి డైరెక్షన్ లో సోలో హీరోలుగా నటించాలని ఆశ పడుతుండగా బాలీవుడ్ హీరోలతో జక్కన్న సినిమాలను తెరకెక్కిస్తారో లేదో చూడాల్సి ఉంది.