‘సైరా’ గొప్పతనం ‘చావా’ చూస్తేనే కానీ అర్థంకాలేదా..?!

‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారం చేసుకుని తీసిన సినిమా ఇది. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ కథని దాదాపు 10 ఏళ్ళ పాటు కాపాడుకుని.. వచ్చిన చిరు.. ఫైనల్ గా సురేందర్ రెడ్డి చేతిలో పెట్టారు.నయనతార (Nayanthara), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), సుదీప్ (Sudeep Sanjeev), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వంటి ఎంతోమంది స్టార్లు ఈ సినిమాలో నటించారు. తెలుగుతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో రిలీజ్ అయ్యింది.

Chhaava

కానీ అనుకున్న ఫలితాన్ని అయితే ఈ సినిమా అందుకోలేదు. కంటెంట్ కి మంచి మార్కులు పడ్డాయి. కానీ థియేట్రికల్ గా నష్టాలు మిగిల్చి ఈ సినిమా ప్లాప్ గా మిగిలిపోయింది. అయితే ఇటీవల బాలీవుడ్లో ‘చావా’ (Chhaava)  సినిమా రిలీజ్ అయ్యింది. ఇందులో కూడా దేశభక్తి అంశం ఉంటుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు హిందీ వెర్షన్ ను ఎగబడి చూస్తున్నారు.

దీంతో తెలుగులో డబ్ చేసి క్యాష్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు అల్లు అరవింద్ (Allu Aravind) . మార్చి 7న తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది. అయితే ‘చావా’ (Chhaava) లాంటి సినిమా తెలుగులో రాలేదు, అలాంటి క్లైమాక్స్ తో తెలుగు వాళ్ళు సినిమా చేయరు అంటూ కొందరు నోరు పారేసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఇంకొంతమంది ‘సైరా’ లో కూడా దేశభక్తి అంశం ఉంటుంది, క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా సాగుతుంది. కానీ దానిని ప్లాప్ చేశారు అని కొందరు గుర్తు చేస్తున్నారు. నిజమే..! కానీ ఇప్పుడు దాని వల్ల ‘సైరా’ కి కలిసొచ్చేది ఏముంటుంది. మన హీరోలు గొప్ప సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు చేస్తే తెలుగు ప్రేక్షకులు చూడరు అని ఎప్పుడూ ప్రూవ్ అవుతూనే ఉంది కదా

మార్చి బాక్సాఫీస్ ఫైట్.. ఎలా ఉండబోతోందంతే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus