Adipurush: హనుమంతుడి సీటుకు పూజలు చేస్తున్న ప్రేక్షకులు!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కృతి సనన్ జంటగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం ఆది పురుష్. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా నేడు అత్యధిక థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమాను చూడటం కోసం పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు (Adipurush) ఈ సినిమా వచ్చిన నేపథ్యంలో సినిమా విడుదలకు ముందు డైరెక్టర్ మాట్లాడుతూ ఎక్కడైతే రాముడి పారాయణం జరుగుతుందో అక్కడ తప్పకుండా హనుమంతుడు వస్తారనేది మన హిందువుల నమ్మకం అని తెలిపారు. అందుకే ఈ సినిమా థియేటర్లలో ప్రసారమవుతున్న సమయంలో తప్పకుండా థియేటర్ కి హనుమంతుడు వస్తారని భావించి ప్రతి ఒక్క థియేటర్లోనూ హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించాలని డైరెక్టర్ కోరారు అయితే ఈయన సూచనల మేరకు ప్రతి ఒక్క థియేటర్లోనూ హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు కేటాయించారు.

ఈ క్రమంలోనే హనుమంతుడి కోసం కేటాయించిన ఈ సీటుకు ప్రస్తుతం ప్రేక్షకులు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఈ సినిమా చూడటం కోసం థియేటర్లకు వచ్చినవారు థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీటుకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆ సీటు పైహనుమంతుడి చిత్ర పటం పెట్టడమే కాకుండా ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించి పూజలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఇలా పెద్ద ఎత్తున పూజలు చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus