Rajamouli: రాజమౌళి మూవీకి సీక్వెల్ కోరుతున్న అభిమానులు.. కానీ?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా ఒక అద్భుతం అనే సంగతి తెలిసిందే. స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొన్ని సినిమాలు కమర్షియల్ గా అద్భుతాలు చేయకపోయినా అభిమానులకు మాత్రం నచ్చాయి. బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు రాజమౌళి ఖ్యాతిని మరింత పెంచాయి. అయితే బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలకు సీక్వెల్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే ప్రేక్షకులలో ఎక్కువమంది ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కాలని కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఈ సినిమా ద్వారా నెట్ ఫ్లిక్స్ కు ఊహించని స్థాయిలో లాభాలు రావడంతో పాటు హాలీవుడ్ నుంచి జక్కన్నకు ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బాహుబలి2 కంటే ఆర్ఆర్ఆర్2 కు ఎక్కువగా క్రేజ్ ఉంటుందని ఈ రెండు ప్రాజెక్ట్ లు తెరకెక్కితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాహుబలి3 గురించి గతంలో కామెంట్లు చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ విషయంలో ఎలాంటి కామెంట్లు చేయలేదు. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. 2023 సమ్మర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. 2025 లేదా 2026లో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. 700, 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

మహేష్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాలని భావిస్తున్నారు. బాలీవుడ్ లేదా హాలీవుడ్ హీరోయిన్ ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటించే ఛాన్స్ అయితే ఉంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus