సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకి కొదువ లేదు. ఫిలిం మేకర్స్ కి మాత్రమే కాదు.. సినీ ప్రేక్షకులకి, అభిమానులకి కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. సినీ పూజా కార్యక్రమాలు దగ్గరనుండి .. విడుదల తేదీ వరకు వాళ్లకి చాలా సెంటిమెంట్లు ఉంటాయి. సినిమా హిట్టయితే ఇవన్నీ లెక్కలోకి రావు. ఎప్పుడైతే ఓ ప్లాప్ ఎదురైంది అప్పుడు ఇలాంటివి నెగిటివ్ థాట్స్ ను కలిగించి బ్యాడ్ సెంటిమెంట్ అనే ముద్ర పడేస్తాయి.
ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు అనగా ఆగస్టు 11న భోళా శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. దీంతో దర్శకుడు మెహర్ రమేష్ ను అలాగే నిర్మాతలను ఇలా అందరినీ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే సోషల్ మీడియాలో కొంతమంది ఆగస్టు 11 అనేది బ్యాడ్ రీలీజ్ డేట్ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. గతంలో కూడా ఆగస్టు 11న రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
అందుకే దీనిని బ్యాడ్ రిలీజ్ డేట్ గా కొందరు భావిస్తున్నారు. ఇక అసలు విషయానికి వెళ్తే.. గతేడాది నాగ చైతన్య .. హిందీలో నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఆగస్టు 11న రిలీజ్ అయ్యింది. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. దానికి ముందు అంటే 2017 లో వచ్చిన నితిన్ ‘లై’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘జయ జానకి నాయక’ సినిమాలు కూడా బాగా ఆడలేదు.
అంతేకాదు 2004 లో రవితేజ హీరోగా వచ్చిన ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’, 2011 లో వచ్చిన నాగచైతన్య ‘దడ’ సినిమాలు కూడా ఆగస్టు 11 కే రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ‘భోళా శంకర్’ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో.. ఇది ‘భవిష్యత్తులో బ్యాడ్ రిలీజ్ డేట్ గా మారే అవకాశాలు లేకపోలేదు’ అని కొందరు అంటున్నారు.