Avanthika: ఇంత దారుణమైన ట్రోల్స్ ఎప్పుడూ చూడలేదన్న అవంతిక.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలనటిగా అవంతిక (Avantika Vandanapu) మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అవంతిక పూర్తి పేరు అవంతిక వందనపు కాగా బ్రహ్మోత్సవం (Brahmotsavam) సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. మనమంతా, ప్రేమమ్ (Premam) సినిమాలు అవంతిక రేంజ్ ను మరింత పెంచాయి. ప్రస్తుతం అవంతిక హీరోయిన్ గా బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా మీన్ గర్ల్స్ సినిమాలో అవంతిక నటించగా సోషల్ మీడియాలో అవంతిక ఎక్స్ పోజింగ్ గురించి ఆమె యాక్సెంట్ గురించి ట్రోల్స్ వచ్చాయి.

వాటి గురించి అవంతిక స్పందిస్తూ అమ్మది హైదరాబాద్ నాన్నది నిజామాబాద్ అని అన్నారు. నేను అమెరికాలో పుట్టి పెరిగానని నాకు పదేళ్లు ఉన్న సమయంలో హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యామని అవంతిక వందనపు కామెంట్లు చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీ ఆఫర్లు రావడంతో ఐదేళ్లు ఇక్కడే ఉన్నామని ఆమె తెలిపారు. నా కోసం అమ్మ జాబ్ కూడా మానేసిందని అవంతిక వందనపు పేర్కొన్నారు.

నేను అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడుతుంటే ట్రోల్స్ చేస్తున్నారని ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె కామెంట్లు చేశారు. నేను అమెరికాలో పుట్టి పెరిగాను కాబట్టి నా యాస అలానే ఉంటుందని అవంతిక వెల్లడించారు. ట్రోల్స్ ను మనం కంట్రోల్ చేయలేమని అయితే ఇంత దారుణమైన ట్రోలింగ్ ను నేనింత వరకు చూడలేదని అవంతిక అన్నారు. అమెరికాలో నెపోటిజం లేదని ప్రతిభను బట్టి అవకాశాలు ఇస్తారని ఆమె తెలిపారు.

నాకు ఇక్కడ హీరోయిన్ గా రాణించాలని ఉందని ఆమె చెప్పుకొచ్చారు. సౌత్ లో, బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేయాలని ఉందని ఆమె తెలిపారు. అవంతిక ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉండగా టాలీవుడ్ లో ఆమె బిజీ అవుతారేమో చూడాలి. అవంతిక ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus