Avasarala Srinivas: సోలో బతుకే సో బెటర్ అంటోన్న అవసరాల!
- September 2, 2021 / 11:52 AM ISTByFilmy Focus
‘అష్టాచమ్మా’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ ఆ తరువాత దర్శకుడిగా, రచయితగా తన సత్తా చాటాడు. తన సినిమాలతో ఏదైనా కొత్తగా చేయాలని చూస్తుంటాడు అవసరాల. అయితే అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు బయటకు పెద్దగా రావు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవసరాల శ్రీనివాస్ కొన్ని విషయాలను బయటపెట్టాడు. అవసరాలకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదట. తన జీవితంలో పెళ్లి అనే చాప్టర్ క్లోజ్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు.
దీనికి కారణాలు ఏంటనేవి చెప్పలేదు కానీ.. తాను మాత్రం ఎప్పటికీ పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారని అడిగితే.. పెళ్లి చేసుకోవాలనుకోవడమే అత్యంత కఠిన నిర్ణయమని అన్నాడు అవసరాల. సోలోగా మన జీవితమేదో మనం ఉన్నప్పుడు.. వేరే వ్యక్తిని మన జీవితంలోకి వాళ్లతో అడ్జస్ట్ కావడానికి ప్రయత్నించడం అంత ఈజీ కాదని.. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకోవడమే కఠిన నిర్ణయమని చెప్పుకొచ్చాడు.

ఇక సినిమా ఇండస్ట్రీలో తను పెద్దగా కష్టపడలేదని.. తనకు సినిమాలంటే ఇష్టం కాబట్టి ఎంఎస్ చేశాక ఇటు వైపు వచ్చానని.. చూసేవాళ్లకు తాను సినిమా రంగంలో చాలా కష్టపడిపోయానని అనిపించి ఉండొచ్చని.. కానీ తానేం చేసినా ఇష్టంతో చేశాను కాబట్టి కష్టంగా అనిపించలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అవసరాల నటించిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!












