Avatar2 OTT: ‘అవతార్‌ 2’ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. అద్దె కట్టకుండా చూడొచ్చు.. ఎప్పటి నుండంటే?

థియేటర్లలో అదరగొట్టిన ‘అవతార్‌ 2’ సినిమా ఓటీటీలోకి వచ్చి చాలా రోజులు అయింది. అయితే అక్కడ మీకు సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నా.. సినిమాను చూసే అవకాశం ఇవ్వలేదు. మళ్లీ ఆ సినిమాను చూడటానికి అదనంగా డబ్బులు పే చేయాల్సి వచ్చేది. దీంతో అదనంగా డబ్బులు చెల్లించి కొంతమంది సినిమా చూశారు. అయితే ఇప్పుడు ఆ అదనం కట్టాల్సిన అవసరం లేకుండా విజువల్‌ వండర్‌ను చూసే అవకాశం కల్పించబోతున్నారు. దీని కోసం అనుకున్న డేట్‌ వివరాలు బయటకు వచ్చాయి.

జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్ 2’. ‘అవతార్’ సినిమా వచ్చిన దాదాపు 13 సంవత్సరాల తర్వాత ‘అవతార్ 2’గా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ వచ్చింది. 2022 డిసెంబర్‌లో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా మీద కాస్త నెగిటివ్‌ వ్యూస్‌ బయటకు వచ్చినా.. విజువల్‌ ఫీస్ట్‌ అనే పేరుతో సినిమా దూసుకుపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సినిమా భారీ హిట్ కొట్టింది.

ఇక ఓటీటీలో మార్చి 28 నుండి సినిమా అందుబాటులోకి వచ్చింది. యాపిల్ టీవీ, అమెజాన్‌ ప్రైమ్ వీడియో, వుడు, గూగుల్ ప్లే, ఎక్స్ ఫినిటీ, ఏఎంసీ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి ఫ్లాట్ ఫామ్స్‌లో ఈ సినిమా ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇవన్నీ పెయిడ్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 19.9 డాలర్లు / సుమారు రూ. 1640 పెట్టి సినిమా చూడాల్సి ఉంటుంది. అయితే జూన్‌ 7 నుండి ఈ అదనపు రుసుము లేకుండా చూడొచ్చు. అయితే హాట్‌స్టార్‌లో మాత్రమే.

‘అవతార్ 2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.9 బిలియన్ల డాలర్ల వసూళ్లను రాబట్టింది. హాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.61 కోట్ల షేర్ వసూలు చేసింది. ‘అవతార్ 2’ సినిమాలో జలచరాలతో మెస్మరైజ్ చేశారు. సముద్ర అడుగు భాగంలో జరిగే సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉన్నాయని చూసినవాళ్లు చెప్పారు. మరిప్పుడు ఓటీటీలో ఎంతలా అలరిస్తాయో చూడాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus