ఆ అమ్మాయి అసూయ పడేలా ఎదగాలనుకున్నా..!

‘జబర్దస్త్’ షోతో కమెడియన్ గా గుర్తు తెచ్చుకున్న అవినాష్ ఇటీవల ‘బిగ్ బాస్’ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. కానీ రీసెంట్ గా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అలా హౌస్ నుండి బయటకి వచ్చిన అవినాష్.. బిగ్ బాస్ సంగతులతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడాడు. జ‌గిత్యాల జిల్లా రాఘ‌వ‌పట్నం అనే చిన్న ప‌ల్లెటూరులో పుట్టి, పెరిగానని.. హైదరాబాద్ వచ్చిన తరువాత ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. సినిమాలు, టీవీ మీద ఇష్టంతో మిమిక్రీ నేర్చుకున్నానని.. స్టేజ్ లు ఇస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పారు.

హౌస్ లో అరియానాతో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ.. అమ్మాయి, అబ్బాయి మధ్య ఆకర్షణ సహజమని, అలానే ఒకే ఇంట్లో నెలల తరబడి ఉన్నప్పుడు ఎవరికైనా నచ్చితే ఇష్టపడడం అంతే సహజమని అన్నారు. అరియనాలో ముక్కు సూటితనం తనకు బాగా నచ్చిందని.. బయటకి గంభీరంగా ఉంటున్నా.. ఆమె సున్నిత మనస్కురాలని అన్నారు. అభిజిత్, అరియానాలలో ఒకరు బిగ్ బాస్ విజేత అవుతారని తన అభిప్రాయాన్ని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులతో పంచుకోని ఓ ముఖ్య విషయాన్ని అవినాష్ బయటపెట్టారు. తానొక భగ్న ప్రేమికుడినని చెప్పారు.

తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడినట్లు చెప్పారు. పెద్దల అంగీకారంతో పెళ్లాడాలనుకున్నామని.. కానీ తాను ప్రేమించిన అమ్మాయి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో పిచ్చివాడిలా మారిపోయానని అన్నారు. కొంతకాలానికి తేరుకున్న తరువాత దూరమైనా అమ్మాయి అసూయ పడేలా ఎదగాలనే పట్టుదల తనలో పుట్టిందని అన్నారు. ఆ రోజు తప్పకుండా వస్తుందనే నమ్మకం తనకుందని అవినాష్ తెలిపారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus