ప్రేమికులను కట్టిపడేస్తున్న ఏయ్ పిల్లా సాంగ్ ప్రివ్యూ

  • February 14, 2020 / 12:43 PM IST

ప్రేమికుల రోజు కానుకగా చైతు సాయిపల్లవి ఓ రొమాంటికి సాంగ్ ప్రివ్యూ తో వచ్చారు. వీరుద్దరూ కలిసి నటించిన లవ్ స్టోరీ మూవీలోని ఏయ్ పిల్లా సాంగ్ ప్రివ్యూ నేడు ఉదయం విడుదలైంది. ఒక నిమిషం నిడివి గల ఏయ్ పిల్లా సాంగ్ ప్రివ్యూ ప్రేమికుల మనసు కదిలించేలా ఉంది. చైతూ, సాయి పల్లవి ల మధ్య గల డీప్ కనెక్షన్, లవ్ బాండింగ్ తెలియజేసేలా ఉంది. ఒక్క చిన్న వీడియో తో వీరిద్దరూ సినిమాపై అంచనాలు పెంచేశారు. వీరిద్దరి ఫెయిర్ తెరపై పేలడం ఖాయంగా కనిపిస్తుంది. మెట్రో ట్రైన్ లో అందరి ముందు చైతూని పల్లవి ముద్దు పెట్టుకోవడం కొత్తగా ఉంది. ఇక ఈ వీడియోలో వీరి లుక్స్ కూడా చాలా వైవిధ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా చైతూ లుక్ డిప్రెషన్ లో ఉంటూ స్ట్రగుల్ అవుతున్న కుర్రాడిలా ఉంది. పక్కింటిలో ఉండే సాయి పల్లవి, చైతు ప్రేమలో పడుతుంది అనిపిస్తుంది.

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల మొదటి సారి చైతూని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంగీతం పవన్ సి హెచ్ అందిస్తున్నారు.గతంలో నాగ చైతన్య పై ఓ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో రాగా అందులో నాగ చైతన్య ఓ ఫిట్నెస్ సెంటర్ లో పనిచేస్తూ ఆర్డినరీ బాయ్ లా కనిపించాడు. ఈ చిత్రాన్ని నారాయణ్ కె నారంగ్, రామ్ మోహన్ రావు తెరకెక్కిస్తున్నారు.


పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక చిన్న విరామం & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus