సెలబ్రిటీల జీవితాలంటేనే ఓ తెరిచిన పుస్తకం. ముఖ్యంగా వారి ప్రేమ, పెళ్లి, విడాకుల విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. ప్రస్తుతం బిగ్‌బాస్ హిందీ సీజన్ 19 కంటెస్టెంట్‌గా వెళ్లిన ప్రముఖ నటి, సింగర్ కునికా సదానంద్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆమె ప్రేమకథలు, పెళ్లిళ్ల గురించి వస్తున్న వార్తలకు తన కొడుకు ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.”నాకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నప్పుడు లేని తప్పు, మా అమ్మకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే ఎందుకొస్తుంది?” అంటూ కునికా కొడుకు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించే వాళ్లకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఇంతకీ కునికా జీవితంలో ఏం జరిగింది? ఆమె కొడుకు ఎందుకలా అనాల్సి వచ్చింది?కునికా తన 18 ఏళ్ల వయసులోనే, తనకంటే 13 ఏళ్లు పెద్దవాడైన అభయ్ కొఠారీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి సియామ్ అనే కొడుకు పుట్టాడు. కానీ, కొన్నాళ్లకే మనస్పర్థలతో ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్‌తో రెండోసారి ఏడడుగులు నడిచింది. వీరికి కూడా ఒక బాబు ఉన్నాడు. అయితే, ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.
ఈ రెండు పెళ్లిళ్లు విఫలమయ్యాక, కునికా జీవితంలోకి మరో ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. మొదట ప్రముఖ నటుడు ప్రాణ్ కొడుకు సునీల్ సికాంద్‌తో ఆమె ప్రేమలో పడింది. కానీ ఆ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తర్వాత 1990లలో ఫేమస్ సింగర్ కుమార్ సానుతో కునికా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే, ఈ ప్రేమకథ కూడా మధ్యలోనే ముగిసిపోయింది.ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న కునికా గురించి ఈ విషయాలు మళ్లీ తెరపైకి రావడంతో, ఆమె కొడుకు తల్లికి పూర్తి మద్దతుగా నిలబడ్డాడు. తల్లి జీవితంలో ఇన్ని బంధాలు ఉన్నా, ఆమెను తప్పు పట్టకుండా అర్థం చేసుకున్న కొడుకు తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.