శ్రీరాముడి ప్రతిష్టకు ఈ హీరోలకు ప్రత్యేక ఆహ్వానం.. ఏం జరిగిందంటే?

చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం ప్రతిష్టకు ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి. 2024 సంవత్సరం జనవరి నెల 22వ తేదీన శ్రీరాముడు మందిరంలో కొలువుదీరనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి చాలామందికి ఆహ్వానాలు అందాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మొదట చిరంజీవికి ఆహ్వానం అందగా ఆ తర్వాత స్టార్ హీరో ప్రభాస్ కు ఆహ్వానం అందింది. దేవాలయ నిర్వాహక కమిటీ మొత్తం 2,000 మందికి ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరి కొందరు సెలబ్రిటీలకు సైతం మరికొన్ని రోజుల్లో ఆహ్వానం అందే అవకాశం అయితే ఉంది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రజనీకాంత్, ధనుష్ లకు శాండిల్ వుడ్ ఇండస్ట్రీ నుంచి యశ్, రిషబ్ శెట్టిలకు ఆహ్వానం అందిందని సమాచారం అందుతోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అలియా భట్, రణ్ బీర్ కపూర్ లకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. అజయ్‌ దేవ్‌గణ్‌, సన్నీ డియోల్, నిర్మాత మహావీర్ లకు సైతం ఆహ్వానం అందినట్టు సమాచారం అందుతోంది.

ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటించడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండటంతో ఆయనకు ఆహ్వానం అందినట్టు సమాచారం అందుతోంది. మలయాళం నుంచి కేవలం మోహన్ లాల్ కు మాత్రమే ఆహ్వానం అందిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. అయోధ్య ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందడం కూడా ప్రత్యేక గౌరవంగా చాలామంది భావిస్తారు.

చిరంజీవి, ప్రభాస్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుండగా ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus