బహుబలి సినిమాలో అంతా హైలైట్ అనే చెప్పాలి. అయితే అందులో సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీన్ సినిమాతో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. అయితే అలాంటి సీన్ రాయడానికి ఆపసోపాలు పడ్డాను అంటున్నాడు రచయిత విజయేంద్ర ప్రసాద్. అంతేకాకుండా ఆ సీన్ కు పవన్ ఇన్స్పిరేషన్ అంటున్నాడు అది ఎలాగా అని అంటే ఒక్కసారి ఈ కధ చదవండి…పవన్ కల్యాణ్ ఒక ఇన్స్పిరేషన్, పవన్ వల్ల చాలా మంది చాలా ఇన్‌స్పైర్ అయ్యారు. అయితే సహజంగా సామాన్యులు ఇన్‌స్పైర్ అయితే పర్వాలేదు కానీ సాక్షాత్తూ బాలీవుడ్ కు కధలు అందించి, దర్శకత్వం వహించిన ఒక ప్రఖ్యాత రచయిత ఇన్‌స్పైర్ కావడం నిజంగా గొప్ప విశేషం. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కధా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బాహుబలి సినిమా ఇంటర్వెల్ సీన్ పవన్ కల్యాణ్ ఇన్స్పిరేషన్ తో రాశాను అని తెలిపాడు.
అదే క్రమంలో అసలు ఆ సీన్ ఏంటి? ఆది పవన్ తో ఎలా లింక్ అయ్యింది అని అడగగా, మాట్లాడుతూ, స్క్రీన్ మీద మహీష్మతి ఊపిరి తీసుకో అంటూ విశ్రాంతికి బదులుగా వచ్చిన మాటల గురించి వివరిస్తూ “బాహుబలి2 ఇంటర్వెల్ సీన్ ఎలా ఉండాలన్న విషయం మీద చాలానే ఆలోచించాం. భళ్లాల దేవుడికి పట్టాభిషేకం జరుగుతుంది. కానీ సంతృప్తిగా ఉండలేడు. బాహుబలికి జనం పడుతున్న నీరాజనాలు చూసి ఆసూయతో రగిలిపోతాడు. ఇదీ మేం అనుకున్నది. దాన్ని ఎలా చూపించాలా? అని సతమతమవుతున్న క్రమంలో టీవీలో ఏదో ఆడియో ఫంక్షన్ జరుగుతోంది.పవన్ కల్యాణ్ అక్కడ లేడు. కానీ.. పవన్ పేరు పలికినప్పుడల్లా జనం వెర్రిగా వూగిపోతున్నారు. ఐదునిమిషాల పాటు ఎవరేం మాట్లాడినా వినిపించటం లేదు. ఆ సమయంలో ఎవరున్నా.. చివరకు హీరో ఎవరైనా సరే.. అసూయ పడాల్సిందే. ఈ ఒక్క సీన్ చూసి, బాహుబలి ఇంటర్వెల్ సీన్ రాసేసాడట..అదీ లెక్క!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.