ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ఫిలిం “బాహుబలి”. ఈ సినిమాకి మూడో భాగం తీసి ప్రభాస్, రానా, అనుష్కల కెరీర్ ను ఇబ్బందుల్లో నెట్టడం ఇష్టం లేక రాజమౌళి వద్దనుకొన్నాడు కానీ.. సినిమాకి ఉన్న క్రేజ్ కి, మార్కెట్ కి మరో మూడు పార్టులు తీసినా జనాలు చూస్తారు. అందుకే.. బాహుబలి ప్రీక్వెల్ ను యానిమేషన్ సిరీస్ గా ప్లాన్ చేశారు. శివగామి కథను ఒక సిరీస్, బాహుబలి రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్న తర్వాత ఏం జరిగింది అనేది ఒక సిరీస్ గా ప్లాన్ చేశారు.
ఇందుకు నెట్ ఫ్లిక్స్ ముందుకొచ్చింది నిర్మాణ బాధ్యతలను నిర్వర్తించడం కోసం. ప్రవీణ్ సత్తారు, దేవా కట్టా లాంటి టేలెంటెడ్ డైరెక్టర్స్ చేతిలో ఈ ప్రాజెక్ట్ ను పెట్టింది. అయితే.. విడుదలైన మొదటి సీజన్ కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లభించలేదు. పైగా.. వచ్చిన ఫుటేజ్ తోనూ టీమ్ మెంబర్స్ హ్యాపీగా లేరట. అందుకే.. ఆ ప్రాజెక్ట్ ను ఆపేసి, అప్పటివరకు ఖర్చైన కోట్ల రూపాయలు వృధా అయినా పర్లేదు అనుకొని మళ్ళీ కొత్తగా సిరీస్ ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమైంది.
మరి ఈసారి ఎలాంటి ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ను ప్లాన్ చేస్తుంది? ఏ స్థాయిలో నిర్మిస్తుంది? అనేది చూడాలి. ఇకపోతే.. బాహుబలి యానిమేషన్ సిరీస్ ను మాత్రమే కాక యానిమేషన్ బుక్స్ ను కూడా లాంచ్ చేసే పనిలో ఉన్నారు బృందం.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!