సుబ్బురాజుకి బాహుబలి 2 బూస్ట్ ఇవ్వనుందా ?
- March 31, 2017 / 01:14 PM ISTByFilmy Focus
బాహుబలి చిత్రం కోసం పనిచేసిన టెక్నీషియన్లు, ఆర్టిస్టులందరికీ మంచి పేరు వచ్చింది. డైరక్టర్ రాజమౌళితో పాటు సమానంగా ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కాలకేయుడిగా నటించిన ప్రభాకర్ కి కూడా అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఇతను మొదటి పార్ట్ కి మాత్రమే అంకితమయ్యారు. రెండో పార్ట్ లో అతని లేని లోటుని సుబ్బురాజు తీర్చనున్నారు. వివిధ సినిమాల్లో విలన్ రోల్స్ లో భయపెట్టించిన సుబ్బురాజు బాహుబలి కంక్లూజన్ లో మరింత క్రూరంగా కనిపించనున్నట్లు సమాచారం.
అంతేకాదు చివరికి ఇతనిలో మార్పు వచ్చి మంచి మనిషిగా మారుతాడని తెలిసింది. రెండు వేరియేషన్లో సుబ్బురాజు చాలా చక్కగా నటించారని చిత్ర బృందం వెల్లడించింది. కథలో అతని పాత్ర కీలకం కానుందని, ఈ రోల్ సుబ్బురాజు సినీ కెరీర్ కి మంచి బూస్ట్ ఇవ్వనున్నట్లు వివరించింది. బాహుబలి కంక్లూజన్ ట్రైలర్ లో సుబ్బురాజు కనిపించక పోవడం వెనుక రాజమౌళి సర్ప్రైజ్ ప్లాన్ ఉందన్నమాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













