బాబాకి ఎవిక్షన్ ఫ్రీ పాస్..! ఎవరికోసం వాడతాడు..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లోకి గత సీజన్ విన్నర్ అయిన సన్నీ వచ్చి, ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ ని ఆడించాడు. గత సీజన్ లో టాప్ 5లో నిలిచిన అందరూ వచ్చి ఒక్కో టాస్క్ ని ఆడించి నలుగురిని ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఆడేందుకు రెడీ చేశారు. అంతేకాదు, మిస్టరీ బాక్స్ ని సైతం ఇచ్చి రిజల్డ్స్ ని కూడా తారుమారు చేశారు. ఇక సన్నీ ఎంట్రీ ఇవ్వక ముందే సన్నీకి పేరు తీసుకుని వచ్చిన మంకీ టాస్క్ ని ఆడించారు. ఫ్రీ పాస్ కోసం పోటీ పడే నలుగురు మంకీ టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. బాబా రెండు సార్లు, అఖిల్ రెండు సార్లు ఈ టాస్క్ లో గెలిచారు. చివరకి తమతో పాటు గేమ్ ఆడేందుకు అరియానాకి అవకాశం ఇచ్చారు. ఈ టాస్క్ అవ్వగానే గ్రాండ్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇఛ్చిన సన్నీ హౌస్ మేట్స్ లో జోష్ ని నింపాడు. అంతేకాదు, తనదైన స్టైల్లో మచ్చా అంటూ మాట్లాడుతూ గత సీజన్ ని గుర్తు చేశాడు సన్నీ. గత సీజన్ లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని వాళ్ల అమ్మ కళావతి తీస్కుని వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. హౌస్ అంతా తిరుగుతూ తన ఫేవరెట్ ప్లేస్ లని చూస్తూ ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకున్నాడు.
హౌస్ మేట్స్ తో టాస్క్ ఆడించి , ఒక రేంజ్ లో ఎంటర్ టైన్ చేశాడు. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో బాబాభాస్కర్ గెలవగానే అందరూ ఆనందించడాన్ని అభినందించాడు. మా సీజన్ లో ఇలా లేదని, నేను పాస్ సాధించినపుడు ఎవ్వరూ ఆనందంగా లేరని గుర్తు చేసుకున్నాడు. ఇలాంటి ఎంకరేజ్ మెంట్ ఇచ్చే హౌస్ మేట్స్ ఉంటే ఇంకా బాగా ఆడొచ్చని అన్నాడు. ఇక టాస్క్ లో బాబాభాస్కర్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీపాస్ ని సంపాదించాడు.
ఈవారం ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడతారా ? లేదా వచ్చే వారం వాడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరం. బాబాభాస్కర్ నామినేషన్స్ లో ఉంటే ఖచ్చితంగా అధి తనకోసమే వాడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నామినేషన్స్ లో ఆయన లేకపోతే ఇది ఎవరి కోసం వాడతారు అనేది గెస్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే, బాబాభాస్కర్ అప్పటికప్పుడు డెసీషన్స్ తీస్కుంటారు. తను మిత్రా కోసం గేమ్ ఆడి ఒక్క టాస్క్ కూడా గెలవలేకపోయారు కాబట్టి, మిత్రా శర్మా కోసం కూడా వాడే అవకాశం ఉంది. అలాగే, అరియానా కోసం కూడా ఈపాస్ ని వాడచ్చు. మరి బాబాభాస్కర్ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని ఎలా ఉపయోగిస్తారో చూడాలి. మొత్తానికి అదీ మేటర్.

Share.