సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి కొరియోగ్రాఫర్లు ఉన్నారు. ఇలా కొరియోగ్రాఫర్లుగా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు పనిచేసే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ ఒకరు.ఈయన కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో రెండు సార్లు పాల్గొన్న బాబా భాస్కర్ మాస్టర్ పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలో ఈయన నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోని ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబా భాస్కర్ మాస్టర్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తనకు సినిమానే జీవితమని సినిమా కోసం తాను కొరియోగ్రాఫర్ గా నటుడిగా డైరెక్టర్ గా తనకు ఏ అవకాశం వచ్చిన చేస్తానని వెల్లడించారు.
ఇక కిరణ్ అబ్బవరం పక్కన తన స్నేహితుడిగా కీలకపాత్రలో తాను కనిపిస్తానని ఈ సందర్భంగా బాబా భాస్కర్ వెల్లడించారు.ఇక ఈ సినిమాని కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య నిర్మించారు. ఇక ఇందులో ఒక పాటకు కొరియోగ్రఫీ చేయడమే కాకుండా, స్నేహితుడి పాత్రలో కనిపించబోతున్నానని వెల్లడించారు. ఇక ఇప్పటివరకు తాను ఒక సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరించానని త్వరలోనే మరొక సినిమాకి దర్శకత్వం వహించాలని భావిస్తున్నాను అంటూ ఈయన తెలియచేశారు.
ఇప్పటికే కథ సిద్ధంగా ఉందని అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ఈయన తెలిపారు. ఇకపోతే తనకు కొరియోగ్రాఫర్ గా రాష్ట్ర జాతీయస్థాయిలో అవార్డు అందుకోవాలని తన కోరిక అని ఈ కోరిక నెరవేర్చడం కోసం తాను ఎంత కష్టమైనా భరిస్తానని ఈ సందర్భంగా బాబా భాస్కర్ మాస్టర్ డాన్స్ పై తనకున్న మక్కువను ఆసక్తిని బయటపెట్టారు. ఇలా డాన్స్ గురించి ఈయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.