Baba Master: కెప్టెన్సీ టాస్క్ లో ట్విస్ట్ ఏంటి..? నటరాజ్ గేమ్ ఆడితే బాబా కెప్టెన్ ఎలా అయ్యారంటే..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో 9వ వారం కెప్టెన్ గా బాబాభాస్కర్ ఎంపిక అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. కిల్లర్ టాస్క్ లో అద్భుతంగా నటరాజ్ మాస్టర్ గేమ్ ఆడితే, బాబాభాస్కర్ కెప్టెన్ ఎలా అయ్యాడా అని ఇప్పుడు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం బిందు, అషూరెడ్డి, మిత్రా శర్మా, బాబాభాస్కర్ ఇంకా నటరాజ్ మాస్టర్ లు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచినట్లుగా సమాచారం. నిజానికి కిల్లర్ టాస్క్ లో నటరాజ్ మాస్టర్ ముగ్గురుని మర్డర్ చేశారు.

Click Here To Watch NOW

ఫస్ట్ యాంకర్ శివతో ఉప్పు కలిపిన టీని తాగించాడు. ఆ తర్వాత అనిల్ టీషర్ట్ కి లిప్ స్టిక్ పూశాడు. అలాగే, అరియానా బెడ్ పైన నీళ్లు పోసి అరియానాని అవుట్ చేశాడు. ఆ తర్వాత హమీదాని కూడా మర్డర్ చేసినట్లుగా తెలుస్తోంది అలాగే, అఖిల్ కూడా మర్డర్ అయినట్లుగా సమాచారం. మొత్తం ఐదుగురిని దిగ్విజయంగా ఎవ్వరికీ దొరక్కుండా నటరాజ్ మాస్టర్ కిల్ చేశారు. దీంతో మొదటి కెప్టెన్సీ పోటీదారులు అయ్యాడు. అలాగే, ఆయన చేతిలో బలి అవ్వకుండా కిల్ అవ్వకుండా ఉన్న నలుగురు కూడా కెప్టెన్సీ పోటీదారులు అయినట్లుగా తెలుస్తోంది.

ఇక కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయిన వారిలో టాస్క్ లో గెలిచి బాబాభాస్కర్ ఇంటి కెప్టెన్ గా అయ్యారు. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో ఉన్న బాబాభాస్కర్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. అలాగే, నటరాజ్ మాస్టర్ నామినేషన్స్ లో ఉన్నా ప్రస్తుతానికి అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తే సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక్కడే బాబాభాస్కర్ కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి తర్వాత వారానికి ఇమ్యూనిటీ పొందారు. అంటే ఈవారం బాబాభాస్కర్ సేఫ్ అయితే, నెక్ట్స్ వీక్ కూడా బాబాకి ఢోకా లేదు.

అప్పటికి హౌస్ లో కేవలం 8మంది మాత్రమే ఉంటారు. వీరిలో ఫినాలే టిక్కెట్ రేస్ జరిగితే బాబాభాస్కర్ గెలిస్తే నేరుగా ఫైనల్స్ కి వెళ్లే అవకాశం కూడా ఉంది. అందుకే ఇప్పుడు బయట కామెంట్స్ వినిపిస్తున్నాయి. నటరాజ్ మాస్టర్ గేమ్ సూపర్బ్ గా ఆడారని, ఆయన గేమ్ కష్టపడి ఆడితే బాబా మాస్టర్ కెప్టెన్ ఎలా అవుతారని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, లేట్ గా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు టాప్ 5లో దూసుకుపోవడం అనేది కరెక్ట్ గా లేదని, అది వేరే వాళ్ల ప్లేస్ ని ఆక్యూపై చేసినట్లే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ – 3 లో బాబాభాస్కర్ ని ఎంతగానో అభిమానించిన బిగ్ బాస్ లవర్స్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఆయన రావడాన్ని తప్పు బడుతున్నారు. ఫస్ట్ నుంచీ గేమ్ బాగా ఆడిన ఒక జెన్యూన్ ప్లేయర్ గేమ్ నుంచీ వెళ్లి పోవడం కరెక్ట్ గా లేదని, ఇది అన్ ఫెయిర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే బాబాభాస్కర్ సేఫ్ అయితే మాత్రం ఫినాలే రేస్ లో లెక్కలు అన్నీ మారిపోతాయనే అంటున్నారు. అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags