ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కథ, కథనంలో లోపాలున్నా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్టీఆర్, చరణ్ అల్లూరి, కొమురం భీమ్ పాత్రలకు తమ నటనతో ప్రాణం పోశారు. సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నారని తెలుస్తోంది. మొన్న రాధేశ్యామ్ మూవీకి రివ్యూ ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచిన బాబు గోగినేని ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీపై తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
ఆర్ఆర్ఆర్ మూవీని పిల్లలకు చూపించవద్దని ఆయన అన్నారు. దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని గ్రాండ్ గా, చాలా పెద్దగా తీశారని చరిత్రగా ఆర్ఆర్ఆర్ మూవీని నిలపడం కొరకు ఎంతో కష్టపడ్డారని బాబు గోగినేని చెప్పుకొచ్చారు. సినిమాలో సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలో నటన అద్భుతంగా ఉందని ఆయన వెల్లడించారు. అయితే హీరోలిద్దరి మధ్య సంబంధాలు, స్టోరీ పేలవంగా ఉన్నాయని బాబు గోగినేని అభిప్రాయపడ్డారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ లను ఒకరే డైరెక్ట్ చేశారా అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉందని ఈ మూవీ పెద్దవాళ్లకు మాత్రమేనని ఆయన చెప్పారు. అందువల్ల పిల్లలకు ఈ సినిమా చూపించవద్దని ఆయన కోరారు. సినిమాలో డైలాగ్స్ ప్రేక్షకులకు గుర్తుండేలా లేవని ఆయన చెప్పుకొచ్చారు. కథ నాసిరకంగా ఉందని సినిమాలో మహిళలకు ప్రాధాన్యత దక్కలేదని ఆయన చెప్పుకొచ్చారు. మూవీలో లాస్ట్ లో వచ్చిన పాటను పూర్తి న్యాయం చేసే విధంగా చూపించలేదని బాబు గోగినేని కామెంట్లు చేశారు.
ట్విట్టర్ లో బాబు గోగినేని చేసిన ట్వీట్లకు కొందరు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. అయితే మెజారిటీ క్రిటిక్స్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.